శింగనమల మండల పరిధిలోని నాయనపల్లి క్రాసింగ్ వద్ద అక్రమ ఇసుక తరలింపు.
ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఓ టిప్పర్ను శింగనమల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శింగనమల సెప్టెంబర్ 29: బహుజన వేదిక న్యూస్
అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించి టిప్పర్ను అదుపులోకి తీసుకున్నారు.
టిప్పర్ను శింగనమల పోలీస్ స్టేషన్కు తరలించారు.
టిప్పర్ యజమాని, డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు.
అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఎస్ఐ ప్రసాద్ స్పష్టం చేశారు.