Logo
Date of Publish : 03 September 2026, 2:04 pm
Editor : P. Ramanjaneya Prasad

ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చొరవతో నెరవేరబోతున్న నారాయణపురంకు నూతన ఆసుపత్రి

ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చొరవతో నెరవేరబోతున్న నారాయణపురంకు నూతన ఆసుపత్రి

42 లక్షలతో గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన

భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ అంబికా

ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన నారాయణపురం వాసులు

రెండేళ్ల పాలన గురించి 80వేల ఇళ్లకు వెళ్లి వివరించామన్న ఎమ్మెల్యే

ఎల్. నినో నేపథ్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్న ఎంపీ అంబికా

అనంతపురము అర్బన్ సెప్టెంబర్ 03: బహుజన వేదిక న్యూస్

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చొరవతో నారాయణపురంలో నూతన ఆసుపత్రి నిర్మాణం కాబోతోంది. ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకం కింద 42 లక్షలతో గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. ముందుగా నారాయణపురం వాసులు, టిడిపి నాయకులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కి ఘన స్వాగతం పలికారు. భూమి పూజ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్  మాట్లాడుతూ నారాయణపురం ప్రాంతంలో నారాయణపురం ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకొని ఇక్కడ సిబ్బంది, వైద్యులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వారన్నారు.

 

ఏ అవసరం వచ్చినా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఈ సమస్యకు తాము పరిష్కారం చూపించామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ కృషితో ఈ ఆసుపత్రిని నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తవుతుందన్నారు. రెండేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. అందుకే ఇంటింటికి కూటమి ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్లి తాము చేసిన వాటిని వివరించామన్నారు. ఇప్పటికే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 80 వేల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను వివరించామన్నారు.

అనంతపురం జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతానికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. అదేవిధంగా అదే స్థాయిలో ఉద్యోగాలు కల్పన కూడా జరుగుతోందన్నారు. స్త్రీ శక్తి, తల్లికి వందనం, పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు. దీనిపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 1296 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసినట్లు వివరించారు. 250కోట్ల రూపాయలతో రోడ్ల, డ్రైనేజీలు వంటి మాలిక వసతులు కూడా కల్పించామన్నారు. త్వరలోనే 160 కోట్లతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. మరోవైపు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ  మాట్లాడుతూ అనంతపురం జిల్లా పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టితో అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఎల్.నినో ప్రభావంతో మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంలోనూ, ఇతర దేశాల్లో కూడా తీవ్రమైన నీటి సమస్య వచ్చిందన్నారు. మరో ఏడాది పాటు ఈ సమస్య ఉంటుందని అంచనా వేసి ముందే స్పష్టమైన ప్రణాళికతో నీటిని సద్వినియోగం చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ ఏడాది వర్షాలు లేని కారణంగా ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా తాగునీటిని ముందే తగినంతగా నిల్వ చేసుకుంటున్నట్లు చెప్పారు. రైతులెవరు వరి, మిర్చి లాంటి పంటలు వేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్  అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారన్నారు. నారాయణపురంలో ఆసుపత్రి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేలా చేశారని ఎంపీ అంబికా అన్నారు..


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )