Logo
Date of Publish : 12 September 2026, 3:11 pm
Editor : P. Ramanjaneya Prasad

గుంతకల్లు ఏరియా ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీ ప్రారంభం

ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్,

గుంతకల్లు, సెప్టెంబర్ 12 : బహుజన వేదిక న్యూస్

రాష్ట్రవ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు వర్చువల్ గా ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి క్రిటికల్ కేర్ బ్లాకులు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. రూ.249 కోట్ల వ్యయంతో 22 ప్రాజెక్టులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇందులోభాగంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) కింద గుంతకల్లు పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రయోగశాలను గౌరవ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వర్చువల్‌గా ప్రారంభించారు. శనివారం గుంతకల్లు పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీ (IPHL)ను వర్చువల్ విధానంలో ప్రారంభించిన కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, తదితరులు. పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ IPHL అందుబాటులోకి రావడం గుంతకల్లు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరం అని అన్నారు.

వివిధ రకాల వైద్య పరీక్షలను స్థానికంగానే నిర్వహించుకునే అవకాశం కలగడంతో వ్యాధులను సకాలంలో గుర్తించడం, సరైన చికిత్స అందించడం మరింత సులభతరం కానుందన్నారు. ముఖ్యమైన వైద్య పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి గుంతకల్లు ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు ఈ సౌకర్యం మరింత మెరుగైన వైద్య సేవలను అందించడంలో కీలకంగా నిలుస్తుందన్నారు.ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గుంతకల్లు నియోజకవర్గంలో ఆరోగ్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు నా వంతు కృషి కొనసాగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డా.ఈ.వెంకటరావు, ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా.ఆర్.అజేంద్రరావు, ఆర్ఎంఓ డా. జయవర్ధన్ రెడ్డి, వైద్యులు, సీనియర్ రెసిడెంట్ వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )