ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, తదితరులు..
గుంతకల్లు, సెప్టెంబర్ 12 : బహుజన వేదిక న్యూస్
గుంతకల్లు నియోజకవర్గంలో ఆలూరు రోడ్డు నుంచి బంటనహాల్ గ్రామం వరకు SASCI (Special Assistance to States for Capital Investment) పథకం కింద రూ.4.23 కోట్లతో చేపట్టనున్న సుమారు 6.5 నుంచి 7 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులకు భూమి పూజకు సంబంధించిన కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న రహదారి సమస్యకు పరిష్కారం లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గుంతకల్లు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని నిధులు తీసుకురావడంలో చేసిన కృషి అభినందనీయం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తూ రహదారులు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోందన్నారు.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మరిన్ని అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.జి.కొట్టాల – ఖాజీపురం రహదారి నిర్మాణానికి భూమి పూజ గుంతకల్లు పట్టణ సమీపంలోని జి.కొట్టాల గ్రామం నుంచి ఖాజీపురం వరకు SASCI (Special Assistance to States for Capital Investment) నిధుల ద్వారా రూ.3.80 కోట్లతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు భూమి పూజ చేసే కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల వంటి మౌలిక వసతులను కల్పించడం ద్వారా ప్రజల రవాణా కష్టాలను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.