Logo
Date of Publish : 03 September 2026, 3:17 pm
Editor : P. Ramanjaneya Prasad

గుంతకల్‌లో తాగునీటి సమస్య పరిష్కరించాలి ఆర్డీవోకు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు

గుంతకల్, సెప్టెంబర్ 03: బహుజన వేదిక న్యూస్

గుంతకల్ పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నాయకులు స్థానిక ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో పట్టణంలో తాగునీటి సరఫరా దాదాపు వారానికి ఒకసారి మాత్రమే జరుగుతోందని, దీంతో పట్టణ ప్రజలు తాగునీరు, ఇతర అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు.పట్టణంలోని పలు కాలనీల్లో ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు ఏర్పాటు చేసిన సింటెక్స్ ట్యాంకులు, బోర్లు ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో మరమ్మతులకు గురయ్యాయని తెలిపారు. పనిచేయకుండా ఉన్న బోర్లను వెంటనే గుర్తించి పునరుద్ధరించాలని, దెబ్బతిన్న సింటెక్స్ ట్యాంకులకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. అలాగే బోర్లు, సింటెక్స్ సౌకర్యాలు లేని ప్రాంతాలను గుర్తించి కొత్త బోర్లు ఏర్పాటు చేసి ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.బీజేపీ నాయకుల వినతిపై ఆర్డీవో సానుకూలంగా స్పందించి, సమస్యను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేపడతామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుంతకల్ ఓల్డ్ టౌన్ పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు, ఎఫ్‌సీఐ స్టేట్ డైరెక్టర్ వనగొంది విజయలక్ష్మి, పట్టణ ప్రధాన కార్యదర్శి శివ, జిల్లా ఎలక్షన్ ఇన్‌చార్జి గుర్రం సూర్యనారాయణ, జిల్లా ఫైనాన్స్ సెల్ కన్వీనర్ జి.ఎం. మహేష్, బీజేపీ నాయకులు నారాయణరెడ్డి, మహిళా మోర్చా నాయకులు లక్ష్మీ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )