Logo
Date of Publish : 29 September 2026, 2:50 pm
Editor : P. Ramanjaneya Prasad

గుజరాత్ తరహాలో ప్రతి ఇంట్లో ఒక చిన్న తరహా పరిశ్రమ రావాలి ఎం.ఎస్.ఎం.ఈ పరిశ్రమల వృద్ధి వర్క్‌షాప్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 

హోటల్ అలెగ్జాండర్లో కార్యక్రమం.. పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి, ఎంపీ అంబికా

ఎం.ఎస్.ఎం.ఈలో మహిళా పొదుపు సంఘాల ప్రాధాన్యత ఇస్తామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహిస్తుందన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

అనంతపురము సెప్టెంబర్ 29: బహుజన వేదిక న్యూస్

గుజరాత్ తరహాలో ప్రతి ఇంట్లో ఒక చిన్న తరహాలో.. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు అన్నారు. అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్‌లో గల అలెగ్జాండర్ హోటల్‌ నందు నిర్వహించిన చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి వర్క్‌షాప్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, కార్పొరేషన్ డైరెక్టర్లు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్  మాట్లాడుతూ... అనంతపురం జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడి యువతకు ఉపాధి లభించాలన్నా, అభివృద్ధి చెందాలన్నా పారిశ్రామిక ప్రగతి చాలా అవసరమని స్పష్టం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో ప్రతి ఇంట్లోనూ పనులు చేసుకుంటూనే ఒక చిన్న తరహా పరిశ్రమను నడుపుతుంటారని, అలాంటి సరికొత్త పారిశ్రామిక వ్యవస్థ అనంతపురం జిల్లాలో కూడా రావాలని ఆకాంక్షించారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ప్రతి ఇంటికీ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉండాలనే ఉద్దేశంతో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి, హైటెక్ సిటీని నిర్మించారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే విజన్‌తో ప్రతి ఇంటి నుంచి ఒక ఇంటర్‌ప్రెన్యూర్ రావాలన్నదే సీఎం చంద్రబాబు  ముఖ్య లక్ష్యమని, అందుకు అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు అనంతపురం నగరంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఎం.ఎస్.ఎం.ఈ పార్కును ఏర్పాటు చేశామని...

ఈ పనులు దాదాపు పూర్తయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇక్కడ పరిశ్రమలు స్థాపించే వారికి ప్రభుత్వ పరంగా రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యుత్ కనెక్షన్లు, ఇతర వసతుల విషయంలో ఎం.ఎస్.ఎం.ఈలతో పాటు మీడియం స్కేల్, లార్జ్ స్కేల్ పరిశ్రమలకు కూడా సబ్సిడీలు ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ, స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామిక రంగంలో ముందడుగు వేయాలని, వారికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు, ప్రాధాన్యత ఉంటాయన్నారు. రాయలసీమ ప్రాంతానికి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులు వస్తున్నాయని, గతంలో కియా మోటార్స్ సంస్థ ద్వారా దాదాపు 50వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. ఇప్పుడు అదే పంథాలో సుమారు లక్ష కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో మరొక పెద్ద పరిశ్రమను ఈ ప్రాంతానికి తీసుకువస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్  తెలిపారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... అనంతపురం జిల్లాను పారిశ్రామికంగా నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు  ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి, ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నాయన్నారు. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధికి ఎన్నో అనుకూలతలు ఉన్నాయని, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో యువతకు, మహిళలకు సరికొత్త ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు, రాయితీలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బ్యాంకు రుణాల మంజూరులో కానీ, సబ్సిడీల విషయంలో కానీ స్థానిక పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )