గుమ్మగట్ట, సెప్టెంబర్ 08 : బహుజన వేదిక న్యూస్
గుమ్మగట్ట మండలంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ విస్తృతంగా పర్యటించారు. మంగళవారం గుమ్మగట్ట మండలంలోని తాళ్లకెర గ్రామంలో 6వదశ కింద చేపట్టిన రీసర్వే పనులను జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. రీసర్వే పనులను వేగవంతంగా చేపట్టాలని, గడువులోపు అన్ని పనులను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలోని భైరవానితిప్ప ప్రాజెక్టును జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. బిటి ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలను అధికారులతో జాయింట్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
తదనంతరం గుమ్మగట్ట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పురోగతి, రీసర్వే పనులు, మ్యుటేషన్ దరఖాస్తుల పరిష్కారం, తదిదర అంశాలపై తహసిల్దార్, అధికారులతో సమీక్ష చేసి వేగవంతంగా దరఖాస్తులను పరిష్కారం చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.