అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
పామిడి అక్టోబర్ 01 బహుజన వేదిక న్యూస్
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి టిడిపి పార్టీ లక్ష్యం అని ఎంఎల్ఏ జయరాం అన్నారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని కోనేపల్లి గ్రామం నందు విబి -జి రామ్ జి పథకం కింద 15లక్షల రూపాయల నిధులతో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామస్తులు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె పండుగ 3.0 కింద రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యంంత్రి పవన్ కళ్యాణ్ 11,085 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఒకప్పుడు బ్లీచింగ్ పౌడర్ కొనలేని పరిస్థితి నుండి ఇప్పుడు తమ గ్రామానికి ఏం కావాలో వాళ్ళే నిర్ణయం తీసుకునే స్థాయి కి వచ్చారని తెలిపారు, కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని ఎమ్మెల్యే తెలిపారు... ఈకార్యక్రమంలో పామిడి పట్టణ మరియు మండల కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు...