ఆ చీకటి రోజును తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు
అందుకే జగన్ రెడ్డిని 11కి పరిమితం చేశారు
నిజం గెలిచింది కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత
ఆ రోజు పోరాటాల్ని మరోసారి గుర్తు చేసిన ఎమ్మెల్యే సునీత
రాప్తాడు సెప్టెంబర్ 09: బహుజన వేదిక న్యూస్
2023 సెప్టెంబర్ 09వ తేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. స్కిల్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి మూడేళ్లైన సందర్భంగా స్మారక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సునీత కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించారు. ఆ రోజు జరిగిన సంఘటనలను ఆమె గుర్తు చేసుకున్నారు.
సరిగ్గా ఎన్నికల ముందు ఎలాగో ఇక గెలవలేమన్న ఉద్దేశ్యంతో అప్పటి సైకో సీఎం జగన్ రెడ్డి చంద్రబాబును అత్యంత దుర్మార్గంగా అరెస్ట్ చేయించారన్నారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన 73 ఏళ్ల సీనియర్ నాయకుడిని ఎలాంటి ప్రాథమిక ఆధారాలు, కనీస నోటీసులు లేకుండా అరెస్ట్ చేశారన్నారు. దీనిపై ప్రతి తెలుగు వాడి గుండె గాయపడిందన్నారు. పెద్దాయన అరెస్ట్ తో కొందరు గుండె ఆగి చనిపోయారన్నారు. అనంతపురం జిల్లాలో మరీ ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ప్రజలు కదిలి వచ్చి నిరసన కార్యక్రమాలు చేశారన్నారు. 53రోజుల పాటు అలుపెరగకుండా దీక్షలు, నిరసనలు చేశారన్నారు. అప్పట్లో పోలీసులు మహిళలని కూడా చూడకుండా తీవ్రంగా అమానించారని గుర్తు చేశారు. మహిళలపై కూడా కేసులు పెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. చివరకు నిజం గెలిచిందని.. ఆయన తప్పు చేయలేదని అప్పట్లో కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. ఆ తర్వాత కేసు కూడా కొట్టివేశారన్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబును అరెస్ట్ చేయించారని ఆ ఫలితాన్ని జగన్ అనుభవించాడని.. ఆయన్ని 11స్థానాలకు ప్రజలు పరిమితం చేశారన్నారు. భవిష్యత్ లో కూడా ఆ పార్టీ కోలుకునే పరిస్థితిలో లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు యావత్ రాష్ట్ర ప్రజలు మొత్తం అండగా ఉన్నారని.. ఆయన చేసిన సేవకు ఎప్పటికీ రుణపడి ఉంటారని ఎమ్మెల్యే సునీత అన్నారు...