Logo
Date of Publish : 08 September 2026, 1:44 pm
Editor : P. Ramanjaneya Prasad

దళితుల భూ సమస్యలు పరిష్కరించండి సాకే హరి 

బొమ్మనహళ్ ,సెప్టెంబర్ 08: బహుజన వేదిక న్యూస్ దళితుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి తెలిపారు.మంగళవారం బొమ్మనహళ్ మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో దళితుల అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని సాకే హరి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ భూముల ఇల్లు స్థలాలు స్మశాన వాటికల సమస్యలు పరిష్కరించాలని ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిష్కరించకపోవడం చాలా అన్యాయమన్నారు. శ్రీధర్ గట్ట గ్రామంలో దళితులైన ఓన్నూరు స్వామి,ఉలిగేష్ ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుని జీవిస్తున్న భూములను అదే గ్రామానికి చెందిన కొంతమంది భూ కబ్జా జదారులు దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని అడ్డు తగులుతున్నారన్నారు. బాధిత దళితులు రెవెన్యూ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరిన ఫలితం లేకుండా పోయిందన్నారు. పలు గ్రామాల్లో దళితులకు స్మశాన వాటికలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.కొన్నిచోట్ల దళితుల స్మశాన వాటికలను కబ్జా చేస్తున్నారని ఆవేదన చెందారు.రెవెన్యూ అధికారులు మారుతున్నారు తప్ప భూ సమస్యలు పరిష్కరించలేక పోతున్నారని ఇప్పటికైనా స్పందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కులవ్యక్షత గురిచేస్తూ దళితులను వేధింపులు గురి చేయడం మానుకోవాలన్నారు.లేదంటే భూ బాధితులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పవన్,కురాకులపల్లి గోపాల్,రామాంజనేయులు,వన్నూరు స్వామి,అంకె హరి,ప్రవీణ్,చౌడన్న, మహేష్,నాగరాజు,ప్రసాద్, మురళి తదితరలు పాల్గొన్నారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )