బద్వేలు సెప్టెంబర్ 07: బహుజన వేదిక న్యూస్
ప్రతి ఒక్కరూ దోమలు కీటకాలు వలన వచ్చు వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు పేర్కొన్నారు. సోమవారం కమలకూరు సచివాలయం పరిధిలోని మన్యంవారిపల్లి గ్రామము లో "ముందు జాగ్రత్తగా కిటక జనీత వ్యాధులు గురించి గ్రామస్తులు కు అవగాహన కార్యక్రమం వైద్యాధికారి డాక్టర్ కె హామీద బేగం పరివేక్షణాలో, సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బారాయుడు, మరియు కమ్యూనిటీ హెల్త్ అధికారి సి మురళీ కృష్ణ ఆధ్వర్యంలో 
నిర్వహించడం జరిగింది, అలాగే గ్రామం నందు ప్రజలకు పరిసరాల పరిశుభ్రత గురించి మరియు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే గురించి మరియు దోమల ద్వారా వచ్చు మలేరియా, డెంగ్యూ మీద అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది . మరియు గ్రామ పరిసరాల పరిశుభ్రతను పాటించండి, ఆరోగ్యం గా ఉండాలి,అని అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, ఇందులో పాల్గొన్నటువంటి సభ్యులు ,పంచాయతీ సెక్రెటరీ కె వెంకటేశ్వర్లు , పి నాగేశ్వరావు, ఆర్ రాఘవ రెడ్డి, ఆరోగ్య కార్యకర్తలు , ఏఎన్ఎం, పి శంకరమ్మ , ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు అటెండ్ అయినారు.