పామిడి, సెప్టెంబర్ 09 బహుజన వేదిక న్యూస్
మండల పరిధిలోని సచివాలయాల్లో పింఛన్ దరఖాస్తు సమయాల్లో సాంకేతిక లోపం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ అథెంటికేషన్ దరఖాస్తు నమోదు ప్రక్రియలో భాగంగా మొబైల్ నెంబర్లకు రావాల్సిన ఓటీపీలో రాకపోవడం తీవ్ర ఆలస్యంగా వస్తుండడంతో లాగిన్ ప్రక్రియ మధ్యలో నిలిచిపోతుంది. అధికారిక పోర్టల్ ఏపీ సేవ పోర్టల్ పై ఒకేసారి వేలాదిమంది దరఖాస్తుదారులు లాగిన్ అవడానికి ప్రయత్నించడంతో వెబ్సైట్ ఓపెన్ కాక సర్వర్ స్తంభించిపోతోంది. గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో దరఖాస్తుదారులైన వృద్ధులు వికలాంగులు ఇతరులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. రెండేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఎట్టకేలకు కొత్త ఫించన్లకు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవకాశ కల్పించగా మొదటిరోజు సర్వర్ మొరయించడంతో వృద్ధులు వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం నుంచి ఏడు రోజులు మాత్రమే ఆన్లైన్ ద్వారా పింఛన్ల దరఖాస్తులు నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించగా . ఉదయం సచివాలయాలు తెరవక ముందే వృద్ధులు వితంతువులు వాటి ఎదుట బారులు తీరగా అక్కడ ఆన్లైన్ పోర్టల్ పనిచేయలేదు ఉన్నత అధికారులు జోక్యం చేసుకొని సర్దుబాటు చేసిన తర్వాత కూడా అనేకచోట్ల పోర్టల్ పనిచేయలేదు.*వెంటాడుతున్న ఓటీపీ కష్టాలు* సచివాలయంలో పింఛన్ దరఖాస్తు చేసేందుకు ముందుగా ఆధార వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది ఆధార్ కు లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటిపి జనరేట్ అవుతుంది. వన్ టైం పాస్వర్డ్ నెంబర్ చెప్తేనే నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. వృద్ధులు వికలాంగులకు సొంతంగా స్మార్ట్ ఫోన్ లేకపోవడం ఆధారకు లింక్ అయిన ఫోన్ నెంబర్లు మారటం నెట్వర్క్ సమస్యలతో ఓటిపిలో రావడం ఆలస్యం కావడం కొంతమంది లబ్ధిదారులకు లింక్ అయినా ఫోన్ నెంబర్ వేరేచోట ఉంటే వాళ్ళు ఓటిపి చెప్పటం తెలియకపోవటం. వంటి అనేక కారణాలతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వేలమంది అధికారికంగా పోర్టల్ ఏపీ సేవ పోర్టల్ పై ఒకేసారి వేలాది మంది దరఖాస్తుదారులు లాగిన్ అవ్వడానికి ప్రయత్నించడంతో వెబ్సైట్ ఓపెన్ కాక సర్వర్ స్తంభించిపోతోందని డిజిటల్ అసిస్టెంట్లు వాపోతున్నారు. ప్రస్తుతం కొత్త పెన్షన్లుకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింన తరుణంలో అవసరమైన కుల,ఆదాయం, దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు జారీకి ఇతర శాఖల సమన్యాయం అవసరమని ఆశావహులు అంటున్నారు. అర్హులకు అన్యాయం జరగకుండా పెన్షన్లను పొందేందుకు అవసరమైన తోడ్పాటును ఆ శాఖలకు చెందిన అధికారులు అందించాలని పలువురు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆశావహులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.