అనంతపురము, సెప్టెంబర్ 07 : బహుజన వేదిక న్యూస్
అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించగా.. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అర్జీలను స్వీకరించారు.జిల్లా కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ ఏ.మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జున రెడ్డి, రమేష్ రెడ్డి, కిరణ్మయి, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 471 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది. అందులో రెవెన్యూ క్లినిక్ కు సంబంధించి 235 అర్జీలు, ఇతర అర్జీలు 236 రావడం జరిగింది. ఇందులో అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని అధికారులకు అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ లో వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
నిర్ణీత గడువులోగా అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. అర్జీలను ఎలాంటి పెండింగ్ ఉంచడానికి వీలు లేదన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ లో వచ్చిన అర్జీల పరిష్కారంపై ఆయా శాఖల జిల్లా అధికారులు కిందిస్థాయిలో నుంచి మానిటర్ చేయాలని
ఆదేశించారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏలో 26 అర్జీలు ఉండగా, ఆయా శాఖల పరిధిలో పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్న అర్జీలను పరిష్కరించాలన్నారు. ఎప్పటికప్పుడు కిందిస్థాయి అధికారులతో మానిటర్ చేస్తూ పెండింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలన్నారు. ఐవిఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కు సంబంధించి పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, వ్యతిరేకతను తగ్గించాలని ఆదేశించారు. సమగ్ర శిక్ష, ఏపీఎస్ఆర్టీసీ, డిటిసి, తదితర శాఖల ఆధ్వర్యంలో సానుకూల ప్రజా దృక్పథం మరింత మెరుగుపడేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఎస్పిడిసిఎల్ ఎస్ఈ శేషాద్రి శేఖర్, డిటిసి వీర్రాజు, జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి, డ్వామా పిడి సలీమ్ భాష, జడ్పి సిఈఓ విజయలక్ష్మి, డిపిఓ నాగరాజునాయుడు, బిసి వెల్ఫేర్ డిడి ఖుష్భూకొఠారి, పశుసంవర్ధక శాఖ జెడి ప్రేమ్చంద్, ఏపిఎస్ఆర్టీసీ ఆర్ఎం శ్రీలక్ష్మి, ఆర్.అండ్.బి ఎస్ఈ మురళీకృష్ణ, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ గంగాధర్ రెడ్డి, స్వర్ణ గ్రామం - స్వర్ణ వార్డు జిల్లా అధికారి జి.నాసరరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ ఖాన్, ఆర్ఐఓ వెంకట రమణ నాయక్, డిఎండబ్ల్యుఓ రామసుబ్బారెడ్డి, హార్టికల్చర్ డిడి ఉమాదేవి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ కె.శ్రీనివాసులు, మైన్స్ ఎడి ఆదినారాయణ, హెచ్.ఎల్.సి ఎస్ఈ సుధాకర్ రావు, సీపీఓ బాలాజీ నాయక్, పిఆర్ ఎస్ఈ సుబ్బారాయుడు, డిటిడబ్ల్యుఓ శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, సెక్షన్ సూపరింటెండెంట్లు యుగేశ్వరిదేవి, వసంతలత, రియాజుద్దీన్, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.