Logo
Date of Publish : 29 September 2026, 2:40 pm
Editor : P. Ramanjaneya Prasad

ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల విద్యుత్ కేటగిరీ మార్పుపై కృతజ్ఞతలు అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 

అనంతపురము అర్భన్ సెప్టెంబర్ 29: బహుజన వేదిక న్యూస్

ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లకు విద్యుత్ కనెక్షన్లను కేటగిరీ–2 నుంచి కేటగిరీ–3కు మార్పు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల నిర్వహణలో విద్యుత్ చార్జీల భారం తగ్గేలా కేటగిరీ మార్పు చేయడం వల్ల నిర్వాహకులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఇందుకు సహకరించినందుకు కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు, చిన్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపార వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్  హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )