బుక్కరాయసముద్రం, అక్టోబర్ 12 : బహుజన వేదిక న్యూస్ అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం చెరువులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కేంద్ర పథకం కింద రెండో విడతగా 1,47,000 చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో
అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణిశ్రీ, అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, వారి జీవనోపాధికి భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
మత్స్య సంపద యోజన ద్వారా చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ, అర్హులైన మత్స్యకారులకు సబ్సిడీపై సహాయం అందిస్తోందన్నారు. ఆదరణ-3 పథకం ద్వారా వలలు, పడవలు వంటి అవసరమైన పనిముట్లను అందిస్తూ మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోందన్నారు. అలాగే, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20 వేలు ఆర్థిక సహాయం అందించడం, సముద్ర మత్స్యకారులకు డీజిల్, పెట్రోల్ రాయితీలు కల్పించడం వంటి చర్యలతో వారి కుటుంబాలకు అండగా నిలుస్తోందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో గ్రామీణాభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. మత్స్యకారుల అభ్యున్నతికి అవసరమైన ప్రభుత్వ సహాయ సహకారాలు నిరంతరం అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బెస్త సంఘం ప్రతినిధులు, మత్స్యకారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.