Logo
Date of Publish : 08 September 2026, 1:52 pm
Editor : P. Ramanjaneya Prasad

మండల యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక

పామిడి సెప్టెంబర్08: బహుజన వేదిక న్యూస్

మండల యాదవ సంఘం నూతన కమిటీని మంగళవారం రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండలంలోని యాదవ కుటుంబాల సంక్షేమం, సంఘం అభివృద్ధి, ఐక్యతే లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షుడిగా గుగ్గుల్ల మల్లికార్జున యాదవ్, గౌరవ అధ్యక్షులుగా రంగస్వామి యాదవ్, గంగాచంద్ర యాదవ్, శ్రీరాములు యాదవ్, వి. పెద్దిరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఓబుళక్రిష్ట యాదవ్, రామాంజినేయులు యాదవ్, ఈశ్వర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా నాగశివ యాదవ్, కోశాధికారిగా ఓబిరెడ్డి యాదవ్, కార్యదర్శులుగా ఏడుగురిని ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యుల ఎన్నిక అనంతరం యాదవ కుటుంబ సభ్యులు వారిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మండల యాదవ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. సంఘం అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, యాదవ కుటుంబాల ఐక్యత కోసం కృషి చేస్తామన్నారు. మండల వ్యాప్తంగా ఉన్న యాదవ కుటుంబాల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా కుటుంబాల్లో ఎవరైనా కష్టనష్టాలను ఎదుర్కొన్నప్పుడు వారికి అండగా నిలిచి, అవసరమైన సహాయాన్ని అందించేందుకు సంఘం తరఫున ముందుంటామని పేర్కొన్నారు. నూతన కమిటీ ఎన్నికతో మండలంలోని యాదవ కుటుంబాల్లో నూతన ఉత్సాహం నెలకొంది. కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు యాదవ్, రామాజినేయులు యాదవ్, సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )