Logo
Date of Publish : 12 September 2026, 3:19 pm
Editor : P. Ramanjaneya Prasad

మట్టి వినాయకుడిని పూజించాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి.. జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్..

అనంతపురము, సెప్టెంబర్ 12 : బహుజన వేదిక న్యూస్

వినాయక చతుర్థి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ పేర్కొన్నారు. శనివారం అనంతపురం నగరంలోని రాజేంద్ర మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన వినాయక చతుర్థి సందర్భంగా మట్టి విగ్రహాల స్టాల్ ప్రారంభోత్సవంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు.

సహజ రంగులతో చేసిన మట్టి ప్రతిమలతో పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకోవాలన్నారు. వినాయక చవితి పండుగను సుస్థిరంగా మరియు పర్యావరణానికి అనుకూలంగా జరుపుకోవాలని, చెరువులు మరియు జల వనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాల వినియోగం తగ్గిద్దాం లేదా పూర్తిగా మానేయాలన్నారు. మట్టితో చేసిన ప్రతిమలను వాడాలని, విగ్రహాల తయారీకి సహజసిద్ధమైన రంగులను ప్రకృతిలో లభ్యమయ్యే పత్తి, నారా వంటి పదార్థాలను వినియోగించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP) విగ్రహాల వాడకం నిషేధించబడిందని మరియు పిఓపిలో హానికరమైన రసాయనాలు నీటి కాలుష్యానికి దారితీస్తాయన్నారు. నీటి వనరుల కాలుష్యాన్ని నివారించడానికి పర్యావరణ అనుకూలమైన (క్లే) గణేష్ విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలన్నారు. సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా విగ్రహాల తయారీ, నిమజ్జన కార్యక్రమం జరగాలని సూచించారు. వినాయక మండపాలకు అనుమతులు జారీ చేసేటప్పుడు మరియు విగ్రహాల ఏర్పాటు సమయంలో కూడా రెవెన్యూ డిపార్ట్‌మెంట్, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ డిపార్ట్‌మెంట్, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ మరియు పోలీసు డిపార్ట్‌మెంట్‌లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన సవరించిన మార్గదర్శకాలను అనుసరించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ శ్రీమతి శశికళ, ఏఈఈ కృష్ణా రెడ్డి, కుమారి హరిణి, ఉమా మల్లేశ్వరీ దేవి, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )