
అనంతపురంము, అక్టోబర్ 1 (బహుజన వేదిక న్యూస్
విద్యాభారతి, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి గణిత, విజ్ఞాన మరియు సంస్కృతి మహోత్సవంలో అనంతపురం అశోక్నగర్లోని శ్రీ సరస్వతి విద్యామందిరం ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) విభాగంలో ఆరో తరగతి విద్యార్థి బద్రి ఆచారి ప్రథమ బహుమతి సాధించగా, క్విజ్ పోటీల్లో జస్వంత్, భవిష్య, హబ్సన్ బృందం తృతీయ బహుమతి సాధించింది.
విద్యార్థుల విజయంపై పాఠశాల కమిటీ సభ్యులు, ప్రధానాచార్యులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను పోటీలకు సన్నద్ధం చేయడంలో సహకరించిన మహేశ్వరి మాతాజీ, భార్గవి మాతాజీతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి వేదికపై పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.