అనంతపురము, సెప్టెంబర్ 07 : బహుజన వేదిక న్యూస్
వచ్చేవారం వినాయక చవితి పండుగ నేపథ్యంలో గణేష్ ఉత్సవాలు పకడ్బందీగా జరగడం కోసం అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో వినాయక చవితి పండుగ నిర్వహణ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున వీధుల్లో, రహదారులపై వినాయక మండపాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. గణేష్ నిమజ్జనం చేసే ప్రాంతాల వద్ద జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి వారికి సూచించారు. వినాయక మండపాల వద్ద ఫైర్ శాఖ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో గ్రౌండ్ మేనేజ్మెంట్, పారిశుద్ధ్యం, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని, కార్యక్రమం అయిపోయిన తర్వాత చెత్తను తొలగించడం కోసం పంచాయతీ సెక్రెటరీలు ప్రణాళిక వేసుకోవాలన్నారు. పోలీస్, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫైర్ శాఖ, జిల్లా పంచాయతీ అధికారి, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ, తదితర శాఖల అధికారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్ని నిబంధనలు సక్రమంగా పాటిస్తే మండపాలు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని, ఫైర్ సేఫ్టీ, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. నిమజ్జనం జరిగే చోట ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మట్టి వినాయకున్ని పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం..ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని, పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో "మట్టి వినాయకున్ని పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం", "మట్టి గణపతిని చేద్దాం - కాలుష్యాన్ని తగ్గిద్దాం.." అనే పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, అడ్మిన్ అడిషనల్ ఎస్పీ నాగభూషణం, డిఆర్ఓ ఏ.మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జున రెడ్డి, రమేష్ రెడ్డి, కిరణ్మయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ శశికళ, డిపిఓ నాగరాజునాయుడు, ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ బాలకొండయ్య, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి శేఖర్, జిల్లా ఫారెస్ట్ అధికారి శివరాం, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.