Logo
Date of Publish : 03 September 2026, 3:08 pm
Editor : P. Ramanjaneya Prasad

శ్రీపురం చెరువులో పశుగ్రాసం సాగుకు శ్రీకారం.. -: కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా పశుసంవర్ధక అధికారి ప్రేమ్ చంద్, తదితరులు..

గుత్తి, సెప్టెంబర్ 03 : బహుజన వేదిక న్యూస్

గుత్తి మండలం శ్రీపురం ( కొజ్జేపల్లి) గ్రామ చెరువులో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సూపర్ ఎల్.నినో పరిస్థితుల్లో చెరువు గర్భంలో పశుగ్రాసం సాగు ప్రక్రియను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా పశుసంవర్ధక అధికారి ప్రేమ్ చంద్, తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా కురిసిన వర్షాలకు చెరువు గర్భంలో ఉన్న తేమను ఉపయోగించుకొని పశుగ్రాసం అద్భుతంగా పండుతుందనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీపురం చెరువు గర్భంలో 25 ఎకరాల్లో పశుగ్రాసం సాగు చేపట్టడం జరిగింది.

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ సూపర్ ఎల్.నినో పరిస్థితుల్లో చెరువు గర్భంలో పశుగ్రాసం సాగు ఎంతో ముఖ్యమైనదన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 297 ఎకరాల్లో పశుగ్రాస సాగుకు అనుమతి ఇవ్వగా, ఇప్పటివరకు 249 ఎకరాల్లో విత్తనాలు చల్లడం పూర్తయిందని, మిగిలిన విస్తీర్ణంలో కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. పశుగ్రాసం సాగు వల్ల పశువులకు ఆహారం అందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) పద్ధతిలో ఘనజీవామృతం, బీజామృతం ద్వారా విత్తనాలను శుద్ధి చేసి నాటుకున్నట్లయితే, చిన్న చినుకులకు కూడా మొలక వస్తుందని, తదనంతరం భూమి గర్భంలో ఉండే తేమను ఉపయోగించుకొని ఈ కార్యక్రమం విజయవంతం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్ధక అధికారి ప్రేమ్ చంద్ మాట్లాడుతూ పశుగ్రాసం విత్తుకోవడానికి మరియు దున్నుకోవడానికి ఆర్డీటీ సంస్థ వారు ఎకరానికి 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. పశుసంవర్ధక శాఖ తరఫున ప్రతి ఎకరానికి 1,840 రూపాయల విలువ చేసే 20 కేజీల ఉచిత విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు.

ఇక్కడి చెరువులో 25 ఎకరాల్లో పండే పశుగ్రాసం ద్వారా రాబోయే 6 నెలల పాటు సుమారు 200 పశువులకు సరిపడా గ్రాసాన్ని అందించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది, పశుసంవర్ధక శాఖ డిడి రమేష్ రెడ్డి, తహసీల్దార్ పుణ్యవతి, పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )