Logo
Date of Publish : 08 September 2026, 1:09 pm
Editor : P. Ramanjaneya Prasad

54 మంది సివిల్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి  జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్‌ ఐపిఎస్ కి కృతజ్ఞతలు తెలిపిన పదోన్నతి హెడ్ కానిస్టేబుళ్లు

అనంతపురము సెప్టెంబర్ 08: బహుజన వేదిక న్యూస్

తమకు పదోన్నతి కల్పించి, వృత్తిపరంగా ముందడుగు వేసే అవకాశం కల్పించిన జిల్లా ఎస్పీపి.జగదీష్, ఐపిఎస్ ని మరియు అదనపు ఎస్పీ ఎం.నాగభూషణంను పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లు మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. పుష్పగుచ్ఛం అందజేసి తమ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు.

​జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 2007, 2009 బ్యాచ్‌లకు చెందిన 54 మంది సివిల్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించారు.

​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపిఎస్ మాట్లాడుతూ.. పోలీసు కానిస్టేబుళ్లుగా బందోబస్తు, స్టేషన్ నిర్వహణ, కోర్టు డ్యూటీలు, శాంతిభద్రతల పరిరక్షణలో క్రియాశీలకంగా వ్యవహరించారని కొనియాడారు. హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందినందున ఇకపై కేసులు నమోదుతో పాటు దర్యాప్తు చేసే అధికారాలు వస్తాయని, ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈకార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , సూరి, లక్ష్మినారాయణలు పాల్గొని పెద్ద ఎత్తున్న పదోన్నతులు కల్పించిన జిల్లా ఎస్పీ కి మరియు అదనపు ఎస్పీ కి జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. వీరితో పాటు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఏ.ఆర్ నుండీ సివిల్ కు కన్వర్షన్ అయిన కానిస్టేబుళ్లు కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )