Logo
Date of Publish : 03 September 2026, 1:56 pm
Editor : P. Ramanjaneya Prasad

సీబీఆర్‌ నుంచి పీఏబీఆర్‌ కుడి కాలువకు 1 టీఎంసీ వరద నీటిని తరలించాలి బత్తలపల్లి, తాడిమర్రి మండలాలకు తాగునీరు.. 45,800 ఎకరాలకు సాగునీటి ప్రయోజనంజలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ

సీబీఆర్‌ నుంచి పీఏబీఆర్‌ కుడి కాలువకు 1 టీఎంసీ వరద నీటిని తరలించాలి

బత్తలపల్లి, తాడిమర్రి మండలాలకు తాగునీరు.. 45,800 ఎకరాలకు సాగునీటి ప్రయోజనం

సీబీఆర్‌–పీఏబీఆర్‌ కుడి కాలువ చివరి ప్రాంత ఎత్తిపోతల పథకానికి ఆమోదం ఇవ్వాలి

1 టీఎంసీ నీటి కేటాయింపులు మంజూరు చేయండి

సీబీఆర్‌ జలాలతో వ్యవసాయానికి ఊతం.. 45,800 ఎకరాలకు ప్రయోజనం

హార్టికల్చర్‌ హబ్‌ లక్ష్యానికి సీబీఆర్‌ జలాలు కీలకం

జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ

అమరావతి,సెప్టెంబర్ 03:బహుజన వేదిక న్యూస్

ధర్మవరం నియోజకవర్గంలోని కరువు ప్రభావిత బత్తలపల్లి, తాడిమర్రి మండలాల తాగునీటి, సాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ (సీబీఆర్‌) నుంచి 1 టీఎంసీ జీఎన్‌ఎస్‌ఎస్‌ వరద నీటిని పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌) కుడి కాలువ చివరి ప్రాంతానికి తరలించే ఎత్తిపోతల/ప్రెజర్‌ మెయిన్‌ పథకాన్ని మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కోరారు. ఈ మేరకు గురువారం అమరావతిలో మంత్రి నిమ్మల రామానాయుడికి స్వయంగా లేఖ అందజేసి, ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి, తాడిమర్రి మండలాల తీవ్ర నీటి సమస్యను వివరించి, ప్రతిపాదిత పథకానికి తక్షణ ఆమోదం ఇవ్వాలని కోరారు.

పీఏబీఆర్‌ కుడి కాలువకు నీటి కొరతతో చివరి ప్రాంతాలు ఇబ్బందులు....

గతంలో నిర్మించిన పీఏబీఆర్‌ కుడి కాలువ ద్వారా ధర్మవరం సహా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కరువు ప్రాంతాలకు తాగునీరు, సాగునీటి ప్రయోజనాలు అందించడంతోపాటు కాలువ పరిధిలోని చెరువులను స్థిరీకరించేవారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అయితే పీఏబీఆర్‌ జలాశయంలో తగినంత నీటి లభ్యత లేకపోవడంతో గత కొన్ని సంవత్సరాలుగా ధర్మవరం బ్రాంచ్‌ కాలువతోపాటు పీఏబీఆర్‌ కుడి కాలువ చివరి ప్రాంతాలకు హామీ మేరకు నీరు అందడం లేదని పేర్కొన్నారు. గత సంవత్సరాల్లో నీటి విడుదల, చెరువుల నింపుదల పరిస్థితులను పరిశీలిస్తే ఈ సమస్య తీవ్రత స్పష్టమవుతుందని తెలిపారు. దీంతో పీఏబీఆర్‌ కుడి కాలువ చివరి ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రరూపం దాల్చి, ముఖ్యంగా బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

10.23 టీఎంసీల సామర్థ్యం ఉన్న సీబీఆర్‌ నుంచి 1 టీఎంసీ తరలింపు....

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ (సీబీఆర్‌) కీలకమైన నీటి వనరుగా ఉపయోగపడుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. చిత్రావతి నదిపై వైఎస్సార్‌ కడప జిల్లా లింగాల మండలం పర్ణపల్లి గ్రామం సమీపంలో, శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలానికి సమీపంలో నిర్మించిన సీబీఆర్‌కు 10.23 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. సీబీఆర్‌ దిగువ భాగంలో అందుబాటులో ఉండే జీఎన్‌ఎస్‌ఎస్‌ వరద నీటిలో 1 టీఎంసీని ఎత్తిపోసి, పీఏబీఆర్‌ కుడి కాలువ చివరి ప్రాంతంలోని మన్నీల గ్రామం వద్ద సుమారు 93.000/93.500 కిలోమీటర్‌ ప్రాంతానికి ప్రెజర్‌ మెయిన్‌ ద్వారా తరలించే ప్రతిపాదనను మంత్రి లేఖలో వివరించారు.

48 చెరువులు.. 24 చెక్‌డ్యామ్‌లకు నీరు....

సీబీఆర్‌ నుంచి 1 టీఎంసీ నీటిని పీఏబీఆర్‌ కుడి కాలువకు తరలించడం ద్వారా కాలువ పరిధిలోని 48 చెరువులు, 24 చెక్‌డ్యామ్‌లకు నీటిని అందించే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. దీంతో కేవలం తాగునీటి సమస్య పరిష్కారం కావడమే కాకుండా, చెరువుల నింపుదల ద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగి, చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయానికి మరింత స్థిరమైన నీటి వనరులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

బత్తలపల్లి, తాడిమర్రి మండలాలకు తాగునీటికి శాశ్వత పరిష్కారం....

ప్రతిపాదిత పథకం అమలైతే బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో తాగునీటి అవసరాలకు గణనీయమైన మద్దతు లభిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అదేవిధంగా చెరువులు, చెక్‌డ్యామ్‌లకు నీరు చేరడం ద్వారా భూగర్భ జలమట్టాలు మెరుగుపడటంతోపాటు, కరువు ప్రభావిత ప్రాంతాల్లో దీర్ఘకాలికంగా నీటి లభ్యత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల వ్యవసాయం, ఉద్యానవన రంగాల అభివృద్ధికి ఊతం లభించడంతోపాటు పశుపోషణ కార్యకలాపాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. అలాగే ప్రాంతంలోని పర్యావరణ సమతుల్యత మెరుగుపడేందుకు ఈ పథకం దోహదపడుతుందని వివరించారు.

హార్టికల్చర్‌ హబ్‌ లక్ష్య సాధనకు దోహదం....

ధర్మవరం నియోజకవర్గాన్ని ఉద్యాన పంటల అభివృద్ధికి అనువైన ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ప్రతిపాదిత పథకం కీలకంగా ఉపయోగపడుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రత్యేకంగా హార్టికల్చర్‌ హబ్‌ లక్ష్యాన్ని సాధించేందుకు నీటి లభ్యత ఎంతో అవసరమని, సీబీఆర్‌–పీఏబీఆర్‌ నీటి తరలింపు పథకం ఉద్యానవన రంగ అభివృద్ధికి గణనీయమైన తోడ్పాటును అందిస్తుందని పేర్కొన్నారు.

45,800 ఎకరాలకు సాగునీటి ప్రయోజనం....

ఈ పథకం అమలైతే బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లోని మొత్తం 45,800 ఎకరాల వ్యవసాయ, ఉద్యాన పంటలకు సాగునీటి ప్రయోజనం కలుగుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో బత్తలపల్లి మండలం – 21,900 ఎకరాలు, తాడిమర్రి మండలం – 23,900 ఎకరాలు మొత్తం – 45,800 ఎకరాలు సాగునీటి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

1 టీఎంసీ నీటి వినియోగానికి స్పష్టమైన ప్రతిపాదన....

మొత్తం 1 టీఎంసీ నీటిలో సుమారు 559.57 ఎంసీఎఫ్‌టీని చెరువుల నింపుదలకు, మరో 440.43 ఎంసీఎఫ్‌టీని బత్తలపల్లి, తాడిమర్రి మండలాల తాగునీటి అవసరాలకు వినియోగించేలా ప్రతిపాదన రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఈ విధంగా ఒకే పథకం ద్వారా చెరువుల స్థిరీకరణ, తాగునీటి సరఫరా, వ్యవసాయ–ఉద్యాన పంటలకు ప్రయోజనం, భూగర్భ జలాల పెంపు వంటి అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని వివరించారు.

రిజర్వాయర్‌ కోసం భూములిచ్చిన తాడిమర్రి మండలానికి ప్రయోజనం కల్పించాలి....

చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ నిర్మాణం కోసం తాడిమర్రి మండలానికి చెందిన భూములు వినియోగించిన విషయాన్ని కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ తన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. రిజర్వాయర్‌లో నిల్వ అవుతున్న నీటిలో కొంత భాగాన్ని సమీపంలోని కరువు ప్రభావిత ప్రాంతాల అవసరాలకు మళ్లించడం ద్వారా తాడిమర్రి, బత్తలపల్లి మండలాల ప్రజలకు తాగునీరు, సాగునీటి ప్రయోజనాలు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.

సూత్రప్రాయ ఆమోదం ఇచ్చి.. డీపీఆర్‌ సిద్ధం చేయాలి....

ప్రాంతంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు, ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీబీఆర్‌–పీఏబీఆర్‌ కుడి కాలువ చివరి ప్రాంత ఎత్తిపోతల/తాగునీటి పథకానికి సూత్రప్రాయ ఆమోదం ఇవ్వాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ నుంచి 1 టీఎంసీ జీఎన్‌ఎస్‌ఎస్‌ వరద నీటిని పీఏబీఆర్‌ కుడి కాలువ చివరి ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన నీటి కేటాయింపులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సంబంధిత అధికారులను ఆదేశించి అంచనాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తక్షణమే సిద్ధం చేయించి, పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కోరారు. ధర్మవరం నియోజకవర్గంలోని కరువు ప్రభావిత ప్రాంతాల తాగునీటి, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ఈ ప్రతిపాదనపై తక్షణ చర్యలు తీసుకుని, పథకానికి అనుమతులు మంజూరు చేసి అమలు చేసేలా సహకరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )