Logo
Date of Publish : 19 August 2026, 1:28 pm
Editor : P. Ramanjaneya Prasad

టీడీపీతోనే బీసీలకు రాజ్యాధికారం..ఇది మరోసారి నిరూపితమైంది

స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ పై టీడీపీ నేతల సంబరాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

జగన్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్లకు 24శాతానికి తగ్గించారని ఆగ్రహం

అనంతపురం అర్భన్ ఆగష్టు 19: బహుజన వేదిక న్యూస్

తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమని.. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది మరోసారి నిరూపితం చేసిందని.. అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీ నాయకులు, బీసీ విభాగం నేతలు అన్నారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం చొప్పున బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై వారు సంబరాలు చేసుకున్నారు. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి సూచన మేరకు వారు టవర్ క్లాక్ వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీలంతా ముక్తకంఠంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ చరిత్రలో ఉంటుందన్నారు. ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు సీఎం చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ కి, మంత్రి లోకేష్ కి ధన్యవాదాలు తెలినారు. బీసీలు అన్నింటా ప్రాధాన్యత ఇవ్వాలని ఆ రోజు పరితపించారని.. ఎంతో మంది బీసీలను చట్టసభలకు పంపారన్నారు. అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు కి బీసీలకు మొట్టమొదటిసారిగా 1995లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తుచేశారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన గొడ్డలి పార్టీ నాయకుడు 2019లో బీసీ రిజర్వేషన్లలో కోత పెట్టి 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడంతో 16వేల మందికి పైగా బీసీలు పదవులకు దూరమయ్యారన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే బీసీలకు 34శాతాన్ని మళ్లీ అమలు చేస్తామని చెప్పడం గొప్ప విషయమన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ బీసీలకు మేలు చేసేలా పాలన సాగిస్తున్నారని అన్నారు. తాజాగా గవర్నర్ కోటాలో ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తే.. ఇందులో ఒక బీసీ మహిళ అందునా వెనుకబడిన వడ్డెర కులానికి చెందిన మహిళకు అవకాశం కల్పించారన్నారు. అది కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న మహిళకు అవకాశం కల్పించారన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అర్బన్ నియోజకవర్గ నేతలంతా కృతజ్ఞతలు తెలిపారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అన్నమయ్య
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Apply Reporter
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అన్నమయ్య
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Apply Reporter
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )