Logo
Date of Publish : 21 August 2026, 3:30 pm
Editor : P. Ramanjaneya Prasad

ఉండవల్లి ఓటమి….. శాంతించిన రామోజీ ఆత్మ

బహుజన వేదిక న్యూస్

మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో దశాబ్దాల తరబడి కొనసాగిన వివాదానికి సుప్రీంకోర్టు ఎండ్ కార్డ్ వేసింది. మార్గదర్శికి సానుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించి, ఉండవల్లి పిటిషన్‌ను తోసిపుచ్చడంతో ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో మార్గదర్శి విజయం సాధించింది.

విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఉండవల్లి అరుణ్ కుమార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ దాఖలు చేయడానికి అసలు మీరెవరు?" అని ధర్మాసనం నేరుగా ప్రశ్నించింది. తొలి నుంచి ఈ కేసును పరిశీలిస్తే, ఇది ప్రజా ప్రయోజనాల కోసం వేసిన పిటిషన్‌లా కాకుండా మీ వ్యక్తిగత వివాదంలాగా కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, ఈ కేసులో మీరు వాదించే కొద్దీ మీపైనే అనుమానాలు పెరుగుతున్నాయంటూ జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ స్పష్టం చేయడం సంచలనంగా మారింది.

మరోవైపు మార్గదర్శి తరఫున ప్రఖ్యాత సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, నాగముత్తు తమ బలమైన వాదనలను కోర్టు ముందుకు తెచ్చారు. మార్గదర్శి మొదటి నుంచీ డిపాజిటర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని, ఇప్పటివరకు దాదాపు రూ. 2,500 కోట్లను డిపాజిటర్లకు విజయవంతంగా తిరిగి చెల్లించేసిందని వివరించారు. ఇక క్లెయిమ్ చేయని మిగిలిన రూ. 5.23 కోట్ల స్వల్ప మొత్తాన్ని నిబంధనల ప్రకారం ఎస్క్రో - Escrow ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే తెలంగాణ హైకోర్టు పబ్లిక్ నోటీసులు ఇచ్చి పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేసిందని స్పష్టం చేశారు.

సుప్రీం నిర్ణయంతో సుదీర్ఘకాలంగా ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు, ఆరోపణలు గాల్లో తేలిపోయాయి. మార్గదర్శి వ్యవస్థాపకులు రామోజీరావు తన జీవితకాలంలో ఎదుర్కొన్న అతిపెద్ద వివాదాల్లో ఇది ఒకటి. వ్యాపార విలువలకే పెద్దపీట వేస్తూ, ఏ ఒక్క డిపాజిటర్‌కూ రూపాయి నష్టం రాకుండా కాపాడిన రామోజీరావు నిజాయితీని అత్యున్నత న్యాయస్థానం తీర్పు మరోసారి చాటిచెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుతో మార్గదర్శి పై ఉన్న ఆరోపణలన్నీ పటాపంచలై, రామోజీరావు ధర్మపోరాటానికి సార్థకత చేకూరి ఆయన ఆత్మకు శాంతి లభించినట్లయింది.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అన్నమయ్య
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Apply Reporter
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అన్నమయ్య
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Apply Reporter
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )