బద్వేలు, సెప్టెంబర్ 29: బహుజన వేదిక;
బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బద్వేలు నియోజకవర్గ ఇన్చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి సుమారు 6,700 మంది ప్రజలు బస్సులలో రామాపురానికి తరలివెళ్లారు.
ఈ సందర్భంగా సూర్యనారాయణ బస్సులకు రెడ్డి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.కార్యక్రమానికి తరలివెళ్లిన ప్రజలకు భోజన ఏర్పాట్లు కూడా చేశారు.
పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో జనసంద్రంగా మారింది ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సంబంధిత అధికారులు, సిబ్బందికి మంచూరు సూర్యనారాయణ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రామాపురంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాటు, గ్రామీణ అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.