Logo
Date of Publish : 09 September 2026, 1:01 pm
Editor : P. Ramanjaneya Prasad

క్రీడాకారులను ప్రోత్సహిస్తాం.. ప్రతిభను వెలికితీస్తాం – మంత్రి సత్యకుమార్ యాదవ్

అమరావతి హాకీ ఛాంపియన్‌షిప్‌లో సత్యసాయి జిల్లా క్రీడాకారుల సత్తా

అండర్-17 బాలికల జట్టుకు ఛాంపియన్‌షిప్‌.. అండర్-23 బాలుర జట్టుకు రన్నరప్‌ స్థానం

విజేతలను అభినందించి శాలువాలతో సత్కరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్

క్రీడల్లో గెలుపే కాదు.. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలే లక్ష్యంగా అలవర్చుకోవాలి – మంత్రి సత్యకుమార్ యాదవ్

ధర్మవరం, సెప్టెంబర్ 09: బహుజన వేదిక న్యూస్

తిరుపతిలో ఆగస్టు 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన అమరావతి హాకీ ఛాంపియన్‌షిప్‌–2026 టైటిల్ పోటీల్లో సత్యసాయి జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటారు. ఈ పోటీల్లో అండర్-17 బాలికల విభాగంలో సత్యసాయి జిల్లా బాలికల హాకీ జట్టు అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి ప్రథమ స్థానంలో నిలిచి ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. అదే విధంగా అండర్-23 బాలుర విభాగంలో సత్యసాయి జిల్లా బాలుర హాకీ జట్టు హోరాహోరీగా పోరాడి ద్వితీయ స్థానాన్ని సాధించి రన్నరప్‌గా నిలిచింది. జిల్లా స్థాయిలో శిక్షణ పొంది రాష్ట్రస్థాయి పోటీల్లో

అత్యుత్తమ ప్రతిభ కనబరచి విజయాలు సాధించిన క్రీడాకారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ అభినందించారు. విజేతలైన బాలికల జట్టు, రన్నరప్‌గా నిలిచిన బాలుర జట్టు సభ్యులను మంత్రి శాలువాలతో సత్కరించి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... క్రీడల్లో విజయం సాధించడం ద్వారా క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల మరింత పెరుగుతాయని అన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ, అవసరమైన ప్రోత్సాహం అందిస్తే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉందన్నారు. అమరావతి హాకీ ఛాంపియన్‌షిప్‌–2026లో సత్యసాయి జిల్లా బాలికల జట్టు ఛాంపియన్‌గా, బాలుర జట్టు రన్నరప్‌గా నిలవడం జిల్లాకు మరి ముఖ్యంగా ధర్మవరానికి గర్వకారణమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయి పోటీల్లో పాల్గొని సత్యసాయి జిల్లా పేరును, ధర్మవరం పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టాలని క్రీడాకారులకు ఆయన ఆకాంక్షించారు. విజయాలు సాధించిన క్రీడాకారులతో పాటు వారికి శిక్షణ అందించిన కోచ్‌లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, క్రీడా సిబ్బంది, తల్లిదండ్రులను కూడా మంత్రి అభినందించారు. క్రీడాకారులకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తూ వారి ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )