Logo
Date of Publish : 12 October 2026, 1:36 pm
Editor : P. Ramanjaneya Prasad

తలుపుల మండలంలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి 95 వైసీపీ కుటుంబాలు!

కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరికలు

కదిరి అక్టోబర్ 12:బహుజన వేదిక న్యూస్

కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని, కూటమి ప్రభుత్వ పాలనపై విశ్వాసంతో అన్ని వర్గాల ప్రజలు టీడీపీతో కలిసి ముందుకు వస్తున్నారని కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు అన్నారు.

కదిరి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తలుపుల మండలానికి చెందిన సుమారు 95 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. తలుపుల మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో, మండల కన్వీనర్ మేడ శంకర్ గారి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు పార్టీ కండువాలు కప్పి కొత్తగా చేరిన వారిని సాదరంగా ఆహ్వానించారు.

ప్రముఖ నాయకుల చేరిక

ఉడుములకుర్తి పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ వేంకటపతి నాయుడు, వైసీపీ జనరల్ సెక్రటరీ విష్ణు వర్ధన్ నాయుడుతో పాటు ఉడుములకుర్తి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు రామచంద్ర, చంద్రమోహన్ నాయుడు, వెంకటయ్య నాయుడు, నారాయణస్వామి, మల్లికార్జున, యమయ్య, వీరభద్ర, ఉతప్ప, అనుదీప్, పూజ నాయుడు తదితరులు టీడీపీలో చేరారు.

అలాగే బండ్లపల్లి పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు నరసింహరెడ్డి దంపతులు,అధిశేష్ రెడ్డి ఆనంద్, నాగరాజు, వెంకటరమణ, గంగులమ్మ, రమణ, రామంజులు, అశోక్, వెంకటనారాయణ, ఓబుళకృష్ణ, వంశీ, బన్నీ, వినోద్, కృష్ణ, అశోక్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.

టీడీపీ కుటుంబంలో అందరికీ సముచిత స్థానం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు మాట్లాడుతూ.. కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, యువత, మహిళలు, మైనార్టీలు సహా అన్ని వర్గాల ప్రజలు టీడీపీ వైపు అడుగులు వేయడం సంతోషంగా ఉందని అన్నారు.

పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని, తెలుగుదేశం పార్టీ కుటుంబంలో వారికి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కృష్ణ, సాంబశివ, గంగరాజు, శ్రీశైలం రమణ, బాబ్జాన్, సుదర్శన్ రెడ్డి, ఆంజనేయులు, మౌళిబాబు, రమణ, శ్రీనాథ్, గోపాల్ రెడ్డి, ఉమామహేష్ కుమార్, మునికుమార్,సూరి తదితర టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )