Logo
Date of Publish : 09 September 2026, 12:51 pm
Editor : P. Ramanjaneya Prasad

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్

బీసీలు బలహీన వర్గాలు కాదు.. ఆత్మగౌరవంలో ఎక్కడా తలవంచరు – మంత్రి సత్యకుమార్ యాదవ్

బీసీ ప్రధానిగా దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపింది ప్రధాని నరేంద్ర మోదీనే – మంత్రి సత్యకుమార్ యాదవ్

ప్రజల ఆశీర్వాదంతో ధర్మవరం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం – మంత్రి సత్యకుమార్ యాదవ్

సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేరేలా బీజేపీ కార్యకర్తలు పనిచేయాలి – మంత్రి సత్యకుమార్ యాదవ్

 

ధర్మవరం, సెప్టెంబర్ 09: బహుజన వేదిక న్యూస్

ధర్మవరం నియోజకవర్గంలోని గొట్లూరు గ్రామంలో శ్రీ సత్యసాయి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు అధ్యక్షతన నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. గొట్లూరు గ్రామంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తాను అత్యధికంగా సందర్శించిన ఆలయం గొట్లూరు ఆంజనేయస్వామి ఆలయమేనని తెలిపారు. గ్రామస్తుల ఆశీర్వాదంతోనే తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవ చేసే అవకాశం పొందానని పేర్కొన్నారు. గొట్లూరు గ్రామం అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు, ప్రజలు ఐక్యంగా నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయమన్నారు. గ్రామంలో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో రాజీపడకుండా ముందుకు సాగడం వల్ల గొట్లూరు గ్రామం జాతీయ స్థాయిలో రెండుసార్లు ఉత్తమ గ్రామంగా గుర్తింపు పొంది అవార్డులు సాధించిందని మంత్రి ప్రశంసించారు. బీసీలు బలహీన వర్గాలు కాదని, సామాజికంగా వెనుకబడి ఉండవచ్చుగానీ ఆత్మగౌరవం విషయంలో ఎవరి ముందు తలవంచే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఒక బీసీ కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి, వరుసగా మూడుసార్లు ప్రజల మద్దతు పొందడం బీసీలకు గర్వకారణమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్’ స్ఫూర్తితో దేశంలో సమూలమైన మార్పులు

చోటుచేసుకున్నాయని తెలిపారు. పేదలకు ఇళ్లు, ప్రతి ఇంటికి తాగునీరు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ముద్రా రుణాలు, గ్రామీణ రహదారులు, జాతీయ రహదారులు, వందే భారత్ రైళ్లు, రైతులకు పీఎం కిసాన్ పెట్టుబడి సాయం వంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్టను ప్రధాని నరేంద్ర మోదీ మరింత పెంచారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించే సేవా కార్యక్రమాలను ప్రతి బీజేపీ కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం, అర్హులైన వారికి పథకాల ప్రయోజనాలు అందుతున్నాయా లేదా పరిశీలించడం, అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలందిస్తున్న సిబ్బందిని సత్కరించడం, విద్యార్థులతో మమేకమై వారి ఆలోచనలు తెలుసుకోవడం, ‘సేవా సేతు’ కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం ప్రతి గ్రామంలో ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజాసేవను కొనసాగిస్తున్న ప్రధానమంత్రికి ప్రజల ఆశీస్సులు అందించాలని కోరారు. ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి గత రెండు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. జలజీవన్ మిషన్ పనులు, దశాబ్దాలుగా రహదారులు లేని గ్రామాలకు రహదారి సౌకర్యం, ఉపాధి హామీ, వీబీజీ-రామ్‌జీ పనులు, విద్యుత్ సమస్యల పరిష్కారం వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. కదిరి–ముదిగుబ్బ మధ్య సుమారు రూ.650 కోట్లతో హైవే అభివృద్ధి పనులు తీసుకొస్తున్నామని తెలిపారు. ధర్మవరం ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించే దిశగా ఆయుర్వేద మెడికల్ కాలేజీ మంజూరు చేయించామని, చేనేత కార్మికుల అభివృద్ధి కోసం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ తీసుకొచ్చామని చెప్పారు. ధర్మవరం ప్రాంతంలో వైద్య సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని, ముదిగుబ్బలో ఆస్పత్రి నిర్మాణం, గ్రామాల్లో విలేజ్ హెల్త్ సెంటర్ల ఏర్పాటు, ధర్మవరంలో డయాలసిస్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం వంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే తన విధానమని మంత్రి స్పష్టం చేశారు. ఏ పార్టీకి చెందిన వారైనా అనారోగ్యంతో బాధపడుతూ ప్రభుత్వ సహాయం పొందేందుకు అర్హత కలిగి ఉంటే వారికి సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు ఓటు వేసినా, వేయకపోయినా ధర్మవరం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరినీ తన కుటుంబ సభ్యులుగా భావించి సేవ చేయడం తన బాధ్యతగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాల అమలులో వేగం పెరిగిందన్నారు. పెన్షన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచడంతో పాటు, అర్హులైన వారికి ఇంటి వద్దకే పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ‘తల్లికి వందనం’, ‘దీపం’ వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కల్పిస్తున్నామని, చేనేత కార్మికులు, మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు తదితర వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు ప్రయాణ సౌకర్యం పెరగడంతో పాటు ఆరోగ్య సేవలను సులభంగా పొందే అవకాశం ఏర్పడిందని మంత్రి వివరించారు. గతంలో ఖర్చు భయంతో పెద్ద ఆస్పత్రులకు వెళ్లని మహిళలు, ఇప్పుడు ఉచిత బస్సు సదుపాయంతో మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ సంఖ్య పెరగడం ప్రజలు వైద్య సేవలను మరింతగా వినియోగించుకుంటున్నారనడానికి నిదర్శనమన్నారు.

ఆయుష్మాన్ భారత్ ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల వరకు వైద్య సహాయం అందుతున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ధర్మవరం నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి, అందించిన ఆశీర్వాదాలకు రుణపడి ఉంటానని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజల ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్, బిజెపి జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్, ఓబీసీ ఇన్చార్జి కాపు రామచంద్ర రెడ్డి, ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్, ఓబీసీ రాష్ట్ర కార్యదర్శిలు చంటి, అశోక్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ యాదవ్, శ్రీ సత్యసాయి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు అనిల్ ఓబీసీ జిల్లా ఇన్చార్జి రామాంజనేయులు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిలు హరికృష్ణ, ఓబులేసు, తదితరు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Bahujana Vedika.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • తిరుపతి
    • చిత్తూరు
    • కర్నూలు
    • అల్లూరి సీతారామరాజు
    • నంద్యాల
    • వైఎస్సార్ కడప
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • ఎన్‌టీఆర్
    • ఏలూరు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • పోలవరం
    • ప్రకాశం
    • బాపట్ల
    • మార్కాపురం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • అధ్యాత్మికం
  • ఈ – పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )