కదిరి సెప్టెంబర్ 08: బహుజన వేదిక న్యూస్
ఇటీవల 6 వ తేదీ ఆదివారం కర్నూలు పట్టణంలోని పుష్ప రాజ్ కళ్యాణ మండపంలో జాతీయస్థాయి కరాటే పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్య సాయి జిల్లా కదిరి జైన్ పాఠశాల విద్యార్థులు 8 మంది విద్యార్థులు కటా, కుమిటే 16 విభాగాలలో పోటీ చేయగా 7 బంగారు,3 వెండి,4 కాంశ్య పథకాలు మొత్తం 14 పథకాలను సాధించారు వివరాలు జైన్ పాఠశాలలో యూకేజీ చదువుతున్న ఆద్య వెండి,కాంశ్య పతకాలను,హన్వి బంగారు,కాంశ్య పతకాలను,జస్వి రెండు వెండి పతకాలను,రీదా ముస్కాన్ బంగారు పతకాన్ని,గగన్ రెండు బంగారు పతకాలను,ఫర్హాన్ 2 బంగారు పతకాలను,ఆఫ్నాన్ బంగారు పతకాన్ని, రబ్బన్ రెండు కాంస్య పథకాలను సాధించారు.ఈ కార్యక్రమంలో మెడల్స్ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వారి పాఠశాల ప్రధానోపాధ్యాయులుబాలాజీ, సమన్వయకర్త భాగ్యలక్ష్మి, విద్యార్థులకు మెడల్స్ ప్రశంస పత్రాన్ని అందజేస్తూ విద్యార్థులకు,కరాటే మాస్టర్ షాకీర్ కి అభినందనలు తెలియజేశారు.