
ధర్మవరం ఆగష్టు 19: బహుజన వేదిక న్యూస్
ధర్మవరం శివానగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో సుమారు 500 మీటర్ల దూరంలోని ఉన్న వాటర్ ప్లాంట్ నుంచి పాఠశాల వరకు విద్యార్థులతో వాటర్ క్యాన్లు మోయిస్తున్న ప్రధానోపాధ్యాయుడినీ సస్పెండ్ చేయాలని ధర్మవరం పట్టణంలోని ఆర్డిఓ రాంభూపాల్ రెడ్డి గారికి వినతిపత్రాన్ని అందజేశారు అనంతరం విద్యార్థి సంఘం నాయకులు పి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర, ఏఐఎస్యు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కనుమ దామోదర్ మాట్లాడుతూ విద్యార్థులను విద్యాబోధనకు బదులుగా బోధనేతర పనులకు వినియోగించడం వారి విద్యా హక్కులను దెబ్బతీయడమే కాకుండా భద్రతకు ప్రమాదకరమని వారు అన్నారు. ప్రధానోపాధ్యాయుడి విధులపై గతంలో కూడా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని తెలిపారు
విద్యార్థులతో వాటర్ క్యాన్లు మోయించిన ఘటన పై ఉన్నతస్థాయి అధికారులతో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకొని వచ్చి ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసి శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులు, భద్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు









