
సంఘం, ఐక్య మాదిగ సమాజ్, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు డిమాండ్
పామిడి ఆగస్టు 20: బహుజన వేదిక న్యూస్ కర్నూలులో సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి చేపట్టిన వీల్ చైర్ యాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని ప్రజా బలం సంఘం పామిడి మండల అధ్యక్షుడు సభావత్ గోవిందు నాయక్ మరియు ఐక్య మాదిగ సమాజ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వంకరాజు కాలువ వెంకటేష్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, న్యాయం కోసం పోరాడుతున్న ఒక దివ్యాంగురాలైన మహిళపై పోలీసులు ప్రదర్శించిన వైఖరి ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, యాత్రలను అడ్డుకోవడం ద్వారా కూటమి ప్రభుత్వం నిందితుల పక్షాన నిలబడుతోందనే సందేహం కలుగుతోందని విమర్శించారు. “అవిటి మహిళను ఇబ్బంది పెడితే పోలీసులకు, ప్రభుత్వానికి ఏం వస్తుంది అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, బాధితురాలికి వెంటనే న్యాయం అందించకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి వెంటనే పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పామిడి సుధీర్, ఐక్య మాదిగ సమాధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వంకరాజు కాలవ వెంకటేష్, ప్రజాబలం సంఘం పామిడి మండల అధ్యక్షుడు సభావత్ గోవిందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.









