బండ్ల గణేష్ నివాసానికి ఎమ్మెల్యే పరిటాల సునీతకుమార్తె, అల్లుడికి ధర్మవరం పట్టు వస్త్రాలు ఇచ్చి శుభాకాంక్షలు

పరిటాల రవితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బండ్ల గణేష్

హైదరాబాద్,బహుజన వేదిక న్యూస్

సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్ నివాసానికి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వెళ్లారు. గత ఆదివారం బండ్ల గణేష్ కుమార్తె జనని, అల్లుడు సూర్య తేజ వివాహం ఘనంగా జరిగింది. వివాహానికి పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ హాజరయ్యారు. ఆరోజు హాజరు కాలేకపోయిన ఎమ్మెల్యే సునీత శుక్రవారం ఫిల్మ్ నగర్ లోని బండ్ల గణేష్ నివాసానికి వెళ్లారు. గణేష్ దంపతులు ఎమ్మెల్యే సునీతకు ఘన స్వాగతం పలికారు. నూతన వధూవరులకు ఆమె ధర్మవరం పట్టువస్త్రాలు ఇచ్చి ఆశీర్వదించారు. అనంతరం కుటుంబసభ్యులతో ఆత్మీయంగా గడిపారు. శ్రీరాములయ్య సినిమా సమయం నుంచి బండ్లగణేష్ కు పరిటాల కుటుంబంతో అనుబంధం ఉంది. ఆ సినిమాలో నటించిన బండ్ల గణేష్ పరిటాల రవితో సన్నిహితంగా ఉండే వారు. ఆ రోజులను గణేష్ మరోసారి గుర్తు చేసుకున్నారు. పరిటాల రవితో అనుబంధాన్ని మరువలేనిదని గణేష్ అన్నారు..

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :