ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలపై ఎమ్మెల్యే పరిటాల సునీత దిశానిర్దేశం

  • ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలప

నూతన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో కీలక భేటీ

ప్రమాణ స్వీకరణ , ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలపై సమీక్ష

ఆత్మకూరు, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల నేతలకు కీలక సూచనలు

టీడీపీలోకి ఆత్మకూరు మండలం సనప వైసీపీ ముఖ్య నేతలు

రాప్తాడు నవంబర్ 18: బహుజన వేదిక న్యూస్

ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత టిడిపి నేతలకు దిశా నిర్దేశం చేశారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు, అనంతపురం రూరల్ మరియు రాప్తాడు మండలాల్లో నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో ఆమె అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. గురువారం ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో జరగనున్న మండల కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక, నూతన ఎంపీటీసీ సభ్యుల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమం మరియు ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికల ప్రక్రియపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకారోత్సవం, ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికల ప్రక్రియను అత్యంత ప్రశాంతంగా, సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థుల ఎంపికకు ప్రజా ప్రతినిధులంతా కట్టుబడి ఉండాలన్నారు. ఎక్కడా చిన్నపాటి పొరపాట్లకు కూడా తావివ్వకుండా ఎన్నికల నిబంధనలను పాటిస్తూ ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని నూతన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ఆమె సూచించారు.

 

సనప గ్రామంలో వైసీపీకి భారీ షాక్

ఆత్మకూరు మండలంలో వైసిపి కి గట్టి షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ఎమ్మెల్యే పరిటాల సునీత నాయకత్వంపై నమ్మకంతో ఆత్మకూరు మండలంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో సనప గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సనప గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకులు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాప్తాడు నియోజకవర్గ వైసీపీ పోలింగ్ బూత్ లెవెల్ ఇంచార్జి గంగుల గోపాల్ రెడ్డితో పాటు కురుబ వెంకటార్జున, కురుబ సిద్దయ్య, కురుబ రమేష్ తదితరులు ఎమ్మెల్యే పరిటాల సునీత సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఉంటుందని, గ్రామ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె సూచించారు.

ఇవి కూడా చదవండి :

అనంతపురంలో విద్యార్థి సంఘాల వినూత్న నిరసన..  విద్యార్థులకు భద్రత కల్పించాలని డిమాండ్! కే ఎస్ ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి ఏ ఐ ఎస్ బి, బిసివై విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్

తాజా వార్తలు చదవండి :

అనంతపురంలో విద్యార్థి సంఘాల వినూత్న నిరసన..  విద్యార్థులకు భద్రత కల్పించాలని డిమాండ్! కే ఎస్ ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి ఏ ఐ ఎస్ బి, బిసివై విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్