టీడీపీ లీడర్ షిప్ కాంక్లేవ్ లో ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ జిల్లా నేతలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్ పొలిటికల్ కమ్యునికేషన్‍పై చర్చ – ఎల్ నినోపై అవగాహన

రాప్తాడు సెప్టెంబర్ 08: బహుజన వేదిక న్యూస్

మంగళగిరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన 2వ రోజు టీడీపీ లీడర్ షిప్ కాంక్లేవ్ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, అధ్యక్షులు ఇతర ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్ పాల్గొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలకు మరింత చేరువగా పనిచేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు-అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడం వంటి పలు ముఖ్యమైన అంశాలపై అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్ దిశా నిర్దేశ్యం చేశారు. సుస్థిర అభివృద్ధి, ప్రజాసేవలు, సుపరిపాలన, పొలిటికల్ కమ్యునికేషన్‍పై చర్చ – ఎల్ నినోపై అవగాహన, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై చర్చించారు. అధినేత చంద్రబాబు నాయకత్వ సామర్థ్యం పెంపుపై దిశానిర్దేశం చేశారు. అలాగే సమష్టి కార్యాచరణపై సూచనలు చేశారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :