
, సెప్టెంబర్ 29:హుజన వేదిక న్యూస్
మండల ప్రత్యేక అధికారిగా రాజేంద్ర కుమార్ రెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. మండల ఎంపిటిసి సభ్యుల పదవీకాలం ఇటీవల ముగింది. మండల పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించి, ఎంపీడీఓ శివరాం ప్రసాద్ రెడ్డి, కార్యాలయ సిబ్బందితో చర్చించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి రాజేంద్రకుమార్ రెడ్డికి కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు ఇతర అంశాలపై ఆయన సిబ్బందితో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ సోమశేఖర్, ఏఓ రమణ నాయక్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, విబీజీ రామ్జీ ఏపిఓ మంజుల, టెక్నికల్ సిబ్బంది ఈశ్వర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, స్వచ్ఛభారత్ మండల కోఆర్డినేటర్ వెంకటరమణ నాయక్ పాల్గొన్నారు.








