
ఆరోగ్యమే మహాభాగ్యం సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు
బద్వేల్ , సెప్టెంబర్ 08: బహుజన వేదిక న్యూస్
ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలని వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారని సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు అన్నారు మంగళవారం నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో స్థానిక డాక్టర్ శరత్ కమర్ ఆధ్వర్యంలో సందర్భంగా ఆల్ ప్రోగ్రాం గురించి ప్రజలకు చక్కగా వివరించడం జరిగింది. అలాగే సిద్ధవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు కీటక జనిత వ్యాధులు గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆశ కార్యకర్త, ఆరోగ్య కార్యకర్త గ్రామస్థాయిలో ఉన్న గ్రామ ప్రజలకు మెడికల్ అండ్ హెల్త్ పరంగా వచ్చే సమస్యలు క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది, ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి కుటుంబం ఆరోగ్యమే మహాభాగ్య రీతిగా ముందుకు వెళ్లాలంటే ప్రతి కుటుంబము ప్రతి వ్యక్తి పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలియజే యడం జరిగింది. దోమ పుట్టకూడదు, పుట్టిన దోమ కొట్టకూడదు అని తెలియపరచడం జరిగింది. ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే తప్పకుండా పాటించాలని తెలియపరచడం జరిగింది. అలాగనే ప్రతి సోమవారం కూడా వెక్టార్ కంట్రోల్ ఒక ఇష్యూ రేట్ చేయాలి అని కూడా తెలియపరచడం జరిగింది. ఏ గ్రామంలో అయిన జ్వరం వచ్చినట్లు తెలిస్తే వెంటనే మెడికల్ ఆఫీసర్ దృష్టికి తెలియపరిచి ప్రతి ఇంటికి లార్వా సర్వే ఫీవర్ సర్వే చేస్తూ అక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రజల యొక్క మన్ననలను పొంది ప్రజలకు సేవలు అందించాలని, ఎల్లవేళలకు ప్రజలు అందుబాటులో ఉండాలని తెలియజేశారు.అలాగనే ఈ మల్టీపర్పస్ హెల్త్ ఫిమేల్ విధి నిర్వహణ భాగంగా గ్రామస్థాయిలో చురుకుగా పాల్గొని ప్రతి గవర్నమెంటు ఇచ్చిన ఇండికేటర్స్ ను నూటికి నూరు పర్సెంట్ సాధించాలనే కూడా మీటింగ్ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ గారు శైలజమ్మ, హిమశంకరి, సూపర్వైజర్ సునీల్, ఆశా కార్యకర్తలు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు









