అర్హులైన వికలాంగులకి సదరం సర్టిఫికెట్లు మంజూరు చేయండి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బండారు కుళ్లాయప్ప

అనంతపురము సెప్టెంబర్ 09: బహుజన వేదిక న్యూస్

ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపర్డెంట్ డి. మల్లేశ్వరి కి అర్హులైన ప్రతి విద్యార్థికి ,వికలాంగులకు సదరపు సర్టిఫికెట్ ఇవ్వాలి అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తో కమిటీ సభ్యులు బండారు కుళ్లాయప్ప మాట్లాడుతూ ఈ జిల్లాలో కలెక్టర్ ఆనంద్ సార్ చొరవతో భవిత అనే ప్రోగ్రాం ద్వారా మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు (డిజబిలిటీ )వైకల్యం సమస్యలు ఉంటే మండలాల ద్వారా విద్యార్థులను రికమెండ్ చేసి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు గత నెల 19, 20 తారీఖున విద్యార్థులకు (వైకల్యం)వైద్య పరీక్షలు చేయడం జరిగింది. అందులో పాల్గొన్న విద్యార్థులు దాదాపు అందరూ కూడా ఏదో ఒక అంగవైకల్యంతో చదువుతున్నవారే, కావున అప్లై చేసుకొని,సదరము కు హాజరైన ప్రతి విద్యార్థికి వారి వారి విభాగాల్లో సదరము సర్టిఫికెట్ మంజూరు చేయవలసిందిగా తెలియజేశాము , మరియు నిజమైన వికలాంగులకు అన్యాయం జరుగుతున్నది ఎలాంటి వైకల్యం లేకపోయినా ప్రభుత్వ ఆసుపత్రి వారు సర్టిఫికెట్లు ఇస్తున్నారు, దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, అందుకు స్పందిస్తూ ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకుండా సదరముకు హాజరైన ప్రతి విద్యార్థికి వారి సమస్యలను బట్టి చట్టబడంగా సదరము సర్టిఫికెట్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరియు నా దృష్టికి వచ్చిన అర్హత లేకపోయినా సకలాంగులకు సర్టిఫికెట్లు ఇస్తే కిందిస్థాయి సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానాని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బండారు కుళ్లాయప్ప, వికలాంగుల హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పులకొండ పుల్లన్న,నరేష్ ,రామాంజినమ్మ ,సుబ్బన్న, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :