సమస్యల పరిష్కారమే లక్ష్యం  ఎస్. టి. కమిషన్ చైర్మన్ 

సమస్యల పరిష్కారమే లక్ష్యం

ఎస్. టి. కమిషన్ చైర్మన్

 

అనంతపురము , సెప్టెంబరు09: బహుజన వేదిక న్యూస్

రాష్ట్రంలోని గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్నసమస్యలను పరిష్కరించ డమే  ఎస్. టి. కమిషన్ ముఖ్య లక్ష్యం అని ఆంధ్రప్ర దేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జి రెడ్డి తెలిపారు. జిల్లా పర్యటన భాగంగా స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటుచేసిన పాత్రికేయ సమావేశంలో వెల్లడించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను పర్యటిస్తూ తండాలలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు కమిషన్ చైర్మన్ తెలిపారు. నిన్నటి రోజున శ్రీ సత్య సాయి జిల్లా లోని కదిరి ,నల్లచెరువు, ముదిగుబ్బ మండలాల్లో పర్యటించడం జరిగిందని ముఖ్యంగా తండావాసులు ఆయా తాండాలలో తాగునీటి సౌకర్యాలు తక్కువగా ఉన్నాయని బోర్లు వేసిన కూడా భూగర్భ జలాలు అడుగంటి పోయినందున నీటి కొరత ఏర్పడుతుందని అలాగే తమ కాలనీలకు రోడ్డు తదితర మౌలిక సదుపాయాలు సరిగా లేవని తమ దృష్టికి విన్నవించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా ట్యాంకర్ల రూపంలో తాత్కాలికంగా చర్యలు తీసుకొని నీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నట్టు తెలిపారు. అలాగే ఎల్ నినో వర్ష బావ పరిస్థితుల వల్ల సకాలంలో వర్షాలు లేక రైతులు పెట్టిన పంటలు చేతికి అందక తీర నష్టం జరుగుతుందని అందువల్ల రైతులను కూలీలను ఆదుకోవాలని కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు.వారు కోరుతున్నట్లు ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ గా తాను సమస్యలను పరిశీలించి పై విషయాలపై స్పందిస్తూ ఆయా సమస్యలను పరిష్కరించే దిశగా తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. అంతేగాక భూ వివాద సమస్యలు కూడా ఉన్నాయని, పట్టాల మంజూరులో పలు నిరు పేద గిరిజన కుటుంబాలకు అన్యాయం జరిగినట్లు తమ దృష్టికి ఫిర్యాదులు వచ్చాయని, గిరిజన ఆశ్రమ పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని, గిరిజన ప్రజలకు సంబంధించి స్మశాన వాటికలు కూడా లేవని, అక్రమ కేసులు రద్దు చేయాలని తదితర ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా కమిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టిని సారించి గిరిజన ప్రజలు ఎదుర్కొంట్రా సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన నిధులు సక్రమంగా వినియోగంలోకి రావాలని ఈ విషయంలో అధికారులు అంకితభావంతో పనిచేయాలని అలాగే అర్హులందరికీ సంక్షేమ ఫలాలను అందించేందుకు కృషి చేయాలని ఎస్టి కమిషన్ చైర్మన్ సూచించారు. కమిటీ సభ్యులు పి. వెంకటప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎస్టీ కమిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆయా పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా అదే అంశాలను పరిశీలిస్తోందని తెలిపారు.ప్రభుత్వ శాఖ అధికారులు కూడా అర్హులకు సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఎక్కడైనా అర్హులకు అన్యాయం జరిగినట్లు రుజువైతే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజన విద్యా సంస్థల నిర్వహణ, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గౌరవ సభ్యులు కె. మల్లేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో పేద గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఆయా సమస్యల పై తక్షణమే స్పందించి ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్డీవో ప్రేమాoథ్ కుమార్, డి టి డబ్ల్యూ శ్రీనివాసరావు, అర్బన్ తాసిల్దార్ డి .రాజా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి గిరిజన ప్రజల నుండి పలు సమస్యలతో కూడిన అర్జీలను కమిషన్ బృందం స్వీకరించిందన్నారు

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :