
అనంతపురము, సెప్టెంబర్ 12 : బహుజన వేదిక న్యూస్
అనంతపురం నగరంలోని కృష్ణ కళామందిరంలో ఉన్న శ్రీశ్రీశ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ, ప్రధాన కలశ స్థాపన మహోత్సవం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, డిఆర్ఓ ఏ.మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంత రెవెన్యూ ఉద్యోగుల క్రెడిట్ సహకార సొసైటీ, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సేవా సంఘం, అనంత రెవెన్యూ ఉద్యోగుల క్రీడలు & సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన
ఆలయ ధ్వజస్తంభ, ప్రధాన కలశ స్థాపన మహోత్సవంలో భాగంగా మొదటిరోజు శ్రీ గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహాది దేవతల కలశస్థాపన, మూలవిరాట్టు పూజ, ధ్వజస్తంభ ఆవాహన పూజ, ప్రధాన పూజా, మంగళహారతి నిర్వహించగా, ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రేమంతకుమార్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దివాకర్ బాబు, జిల్లా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోషియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ సంజీవరెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, అనంత రెవెన్యూ ఉద్యోగుల క్రెడిట్ సహకార సొసైటీ వైస్ చైర్మన్ బిఎం.భాష, సెక్రెటరీ కుల్లాయప్ప, ట్రెజరర్ సంజీవరాయుడు, కలెక్టరేట్ యూనిట్ ట్రెజరర్ భరత్, తదితరులు పాల్గొన్నారు.









