
ప్రజలు చెప్పిన సమస్యకు పరిష్కారం చూపడమే మా బాధ్యత – హరీష్ బాబు
నీటి సమస్యను గుర్తించాం.. మంత్రి ఆదేశాలతో పరిష్కారానికి చర్యలు చేపట్టాం – హరీష్ బాబు
ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు నిరంతర పర్యవేక్షణ – హరీష్ బాబు
ధర్మవరం, సెప్టెంబరు 29: బహుజన వేదిక న్యూస్
ధర్మవరం పట్టణంలోని 8వ వార్డులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా నూతన బోరు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. వార్డులో నీటి సమస్యలు ఎదురవుతున్నాయని స్థానిక ప్రజలు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, వార్డులో నీటి సమస్యకు పరిష్కారం చూపేలా అవసరమైన చర్యలు చేపట్టాలని 8వ వార్డు బీజేపీ ఇంచార్జి జూటూరు వెంకటేష్తో పాటు తన నియోజకవర్గ ఇంచార్జి హరీష్ బాబును ఆదేశించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు 8వ వార్డు బీజేపీ ఇంచార్జి జూటూరు వెంకటేష్ ఆధ్వర్యంలో నూతన బోరు ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. వెంకటేష్ ఆహ్వానం మేరకు మంత్రి నియోజకవర్గ ఇంచార్జి హరీష్ బాబు కార్యక్రమంలో పాల్గొని వార్డు ప్రజలతో కలిసి బోరు పనులను ప్రారంభించారు. బోరు తవ్వకం చేపట్టిన అనంతరం సుమారు 100 అడుగుల లోతులోనే నీటి జాడ లభించింది. సుమారు మూడు ఇంచుల మేర నీరు పడటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. నూతన బోరు ద్వారా వార్డులోని ప్రజలకు నీటి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ…. ప్రజలకు ఎదురయ్యే సమస్యలను మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 8వ వార్డులో నీటి సమస్యపై ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురావడంతో, వారి అవసరాలను పరిగణనలోకి తీసుకుని నూతన బోరు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారని పేర్కొన్నారు. మంత్రి సూచనల మేరకు బోరు పనులను ప్రారంభించగా, తక్కువ లోతులోనే నీరు లభించడం సంతోషకరమన్నారు. వార్డులో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా నిరంతరం నీటి అందుబాటు ఉండేలా అవసరమైన చర్యలను కొనసాగిస్తామని హరీష్ బాబు తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి పరిష్కారానికి స్థానిక నాయకులు, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన బోరు పనులు చేపట్టడంపై 8వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి సత్యకుమార్ యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడంపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జూటూరు వెంకటేష్, జమీర్, ఓం ప్రకాష్ గౌడ్, నిరంజన్ యాదవ్, లక్ష్మీనారాయణ, రాము, పోతులయ్య, 8వ వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.









