ఆర్.ఎన్. దివాకర్ రావు కు ఘనసత్కారం …!

పూలమాలలతో ఘనంగా సన్మానించిన వైనం

అభినందన కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులు, మిత్రులు

ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమన్న ఆర్‌.ఎన్‌. దివాకర్ రావు

అనంతపురం  సెప్టెంబర్ 29: బహుజన వేదిక న్యూస్

ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్‌గా ఆర్.ఎన్. దివాకర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి.ఏపీ జేఏసీ అమరావతి సభ్యులు, ఏపీ పోలీస్ ఆఫీసర్స్ రాష్ట్ర ఈసీ సభ్యుడు తలారి పెద్దయ్య ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ (ఆర్.కే.), మెడికల్ రెప్ జయకుమార్, వాల్మీకి జిల్లా నాయకులు వీర తదితరులు అర్ ఎన్ దివాకర్ రావు ను పూలమాలలతో సన్మానించి అభినందించారు.రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆర్.ఎన్. దివాకర్ రావు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి సంఘం తరఫున కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని ఆర్.ఎన్. దివాకర్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :