
పామిడి అక్టోబర్ 09 :బహుజన వేదిక న్యూస్
అర్హులైన లబ్ధిదారులు అందరికి టిడ్కో గృహాలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో చైర్మన్ జనసేనా పార్టీ రాష్ట్ర నాయకులు వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. మండలంలోని టిడ్కో గృహాలను శుక్రవారం ఏపి టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ మరియు గుంతకల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వాసగిరి మణికంఠ కలసి ఇళ్ళ నిర్మాణ పనులను నాణ్యతను
పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేనా నాయకులు మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన ఇళ్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని,టిడ్కో ఇళ్ల నిర్మాణంలో ఎక్కడ రాజీ పడుబోమని తెలిపారు. జనసేనా నాయకులు ధనుంజయ, సూర్యనారాయణ, జి.కొట్టల రామాంజిేయులు, కార్యకర్తలు బిజెపి నాయకులు అంజి నాయక్,నరేష్, మరియు తదితరులు పాల్గొన్నారు.








