మండల అభివృద్ధికి కృషి చేస్తా నూతన ఎంపీడీవో సౌజన్య కుమారి

పామిడి అక్టోబర్ 12 (బహుజన వేదిక న్యూస్) మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా సౌజన్య కుమారి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం నుండి బదిలీ పై ఇక్కడకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి మండల మంరిత అభివృద్ధి కార్యక్రమాలు సత్వరమే కృషి చేస్తానన్నారు.అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేస్తూ విధులలో పారదర్శకంగా పనిచేయాలన్నారు. ముఖ్యంగా గ్రామాలలో పారిశుద్ధ పనులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. కార్యాలయ సిబ్బంది ఆమెకి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :