జిల్లా పోలీస్ పిజిఆర్ఎస్’లో 130 అర్జీల –జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఐపిఎస్స్వీకరణ

బాధితులకు చట్టపరిధిలో త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులకు ఆదేశం

 

–జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఐపిఎస్

అనంతపురము అక్టోబర్ 12: బహుజన వేదిక న్యూస్

 

ప్రజాసమస్యల పరిష్కారానికే పోలీసు యంత్రాంగం తొలిప్రాధాన్యం ఇస్తుందని జిల్లా ఎస్పీ పి.జగదీష్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టం’ (PGRS) కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 130 అర్జీలు నమోదయ్యాయి.

​అనంతరం ఎస్పీ మాట్లాడుతూ… పిజిఆర్ఎస్ ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదునూ చట్టపరిధిలో సమగ్రంగా విచారించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బాధితులకు వేగంగా, పారదర్శకంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కుటుంబ తగాదాలు, తదితర పిటీషన్లకు సంబంధించిన అర్జీలపై వెంటనే స్పందించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ ఎం.నాగభూషణం, అనంతపురం అర్బన్ డీఎస్పీ కరుణాకర్ రావు లు పిటీషన్లు స్వీకరించారు. ఇస్కాన్ సంస్థ ద్వారా పిజిఆర్ఎస్ కు విచ్చేసిన పిటీషనర్లు, వారి సహాయకులకు ఉచితంగా భోజనం అందించారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :