అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయండి                                      ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వి

 

అనంతపురము ఆగష్టు 19: బహుజన వేదిక న్యూస్

ఆగస్టు 24, 25 తేదీల్లో నెల్లూరు నగరంలో జరగనున్న అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వి పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురం నగరంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్లీనరీ సమావేశాల కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ…

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ విద్యకు రెడ్ కార్పెట్ పరుస్తుందన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 ను రద్దు చేసి పేద విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తామని లోకేష్ ఇచ్చిన హామీని నేటికి అమలు చేయపోవడం దారుణమన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగణంగా మెస్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వారు అన్నారు. సంక్షేమ విద్యార్థుల సమస్యలు బయటకు రాకుండా ఉండేందుకే విద్యార్థి సంఘాలను హాస్టల్ లోకి అనుమతించబోము అని సర్క్యులర్ జారీ చేయడం కూటమి ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనం అని వారు అన్నారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా, పాఠ్యపుస్తకాలు సరైన సమయానికి అందించకుండా విద్యార్థులు చదువులను ఏవిధంగా కొనసాగించగలరో చెప్పాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను చదువులకు దూరం చేస్తుందన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, వార్డెన్, ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్ లో ఉన్న రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని, మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంపు కోసం విద్యార్థుల పక్షాన పోరాటాలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఆగస్టు 24, 25 తేదీలలో నెల్లూరు నగరంలో నిర్వహించనున్న అఖిల బ్లారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బి నాయకులు గౌతమ్, ఇంతియాజ్ ,మనోహర్, మంజు, సాయినాథ్ ,మహేంద్ర, విజయ్ ,తదితరులు పాల్గొన్నారు…

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :