
: ఛైర్మన్ తో పాటు 5 మంది సభ్యులు పి..వెంకటప్ప, జి.సునీత, కె.లక్ష్మీ, కె.సాయిరాం, కె.మల్లేశ్వరరావు జిల్లాకు రాక..
– : జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..
అనంతపురము, సెప్టెంబర్ 07 : బహుజన వేదిక న్యూస్
ఈనెల 8, 9వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ తో పాటు 5 మంది సభ్యులు జిల్లాకు వస్తున్నారన్నారు.ఛైర్మన్ తో పాటు సభ్యులు 1. పి.వెంకటప్ప, 2. జి.సునీత, 3. కె.లక్ష్మీ, 4. కె.సాయిరాం, 5. కె.మల్లేశ్వరరావు జిల్లాకు వస్తున్నారని తెలిపారు

.ఈనెల 8వ తేదీన రాత్రి షెడ్యూల్డ్ తెగల రాష్ట్ర కమిషన్ ఛైర్మన్, సభ్యులు అనంతపురములోని ఆర్&బి గెస్ట్ హౌస్కు చేరుకుని రాత్రికి బస చేస్తారు. ఈనెల 9వ తేదీన ఉదయం 08.30 నుండి ఉదయం 09.30 గంటల వరకు గిరిజన నాయకులు, గిరిజన సంఘాలు మరియు గిరిజనులతో అర్జీలను స్వీకరిస్తారు. ఉదయం 09.30 గంటలకు ఆర్&బి గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి 09:45 గంటలకు అనంతపురం నగరంలోని ఏకలవ్య విగ్రహం వద్దకు చేరుకుని, అక్కడ 10 గంటల వరకు ఏకలవ్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించడం చేస్తారు. ఉదయం 10 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 10:45 గంటలకు పామిడి మండలం పాలెం తండా రోడ్డుకు చేరుకుంటారు. ఉదయం 10:45 గంటల నుంచి మధ్యాహ్నం 01:00 గంట వరకు పామిడి మండలం, పాలెం తాండా గిరిజన ప్రజలతో సంభాషణ మరియు సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 02:00 గంటలకు పామిడి మండలం, పాలెం తాండా నుంచి బయలుదేరి అనంతపురం కలెక్టరేట్ కు చేరుకుంటారు. అనంతపురం కలెక్టరేట్ లో మధ్యాహ్నం 02:30 గంటల నుంచి సాయంత్రం 05:00 గంటల వరకు జిల్లా కలెక్టర్, ఎస్.పిలతో పాటు జిల్లా స్థాయి అధికారులందరితో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 05:00 గంటలకు కలెక్టరేట్ నుంచి బయలుదేరి అనంతపురము ఆర్&బి గెస్ట్ హౌస్కు చేరుకుంటారు.









