ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్ రెడ్డి  అలాంటి వ్యక్తి మంత్రి లోకేష్ పై ఆరోపణలు చేస్తున్నాడు.. ఎమ్మెల్యే దగ్గుపాటి  నీరు ప్రగతి పార్క్ వద్ద 80లక్షలతో సీసీ రోడ్డుకు భూమి పూజ త్వరలో 350 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్న ఎమ్మెల్యే

అనంతపురము సెప్టెంబర్ 12: బహుజన వేదిక న్యూస్

ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్ రెడ్డి అని అలాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై ఆరోపణలు చేస్తున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీ లో ఉన్న నీరు ప్రగతి పార్క్ సర్కిల్ వద్ద 80 లక్షలతో సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 1300 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసామన్నారు. 250 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులు కల్పించామన్నారు. గత ఐదేళ్లలో ఎక్కడా కూడా రోడ్లు డ్రైనేజీలు వేసిన పాపాన పోలేదన్నారు.

కనీసం కాలువలు శుభ్రం చేసిన పరిస్థితి కూడా లేదన్నారు. కేవలం ఏదో చేస్తున్నామని చెప్పి మభ్యపెట్టి దొంగ బిల్లులు చేసుకున్నారని విమర్శలు చేశారు. ఒక్క శ్రీనగర్ కాలనీలోనే రెండు కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. మరో 80 లక్షలు రూపాయలతో నేడు సిసి రోడ్డుకు భూమి పూజ చేసామన్నారు. శ్రీనగర్ కాలనీ రూపురేఖలు మారుస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రోడ్లన్నీ నిర్మించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరో 350 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

కేవలం ఈ రెండేళ్లలోనే 600 కోట్ల రూపాయలతో నగరంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేటాయించారన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారన్నారు. 16,347 పోస్టులను 150 రోజుల్లోనే భర్తీ చేశారన్నారు. అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ జరిగితే వైసిపి నాయకులు అందులో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్నారన్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరినప్పటికీ వైసీపీ నాయకులు రాలేదన్నారు. పొద్దున లేచినప్పటి నుంచి డీఎస్సీ మీద ఆరోపణలు చేస్తూ బురదచల్లుతున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :