కుష్ఠు వ్యాధిని సమూలంగా నిర్మూలించాలి.. – : వ్యాధి నిర్ధారణ కోసం ఈనెల 11 తేదీ నుండి 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించండి.. -: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..

అనంతపురము, సెప్టెంబర్ 07 : బహుజన వేదిక న్యూస్

కుష్ఠు వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని, కుష్ఠు వ్యాధి నిర్ధారణ కోసం ఇంటింటి సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 తేదీ నుండి 24వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెనింగ్ కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిని సమూలంగా నిర్మూలించడం కోసం వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది చేత ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాధి లక్షణాలు ఉన్న అనుమానిత కేసులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపి వైద్యుల చేత వ్యాధి నిర్ధారింపజేసి వెంటనే ఉచితంగా ఎండిటి మందులను అందించడం జరుగుతుందన్నారు. తద్వారా కుష్ఠు వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని, అలాగే కుష్ఠు వ్యాధి వల్ల కలిగే అంగవైకల్యంను కూడా నిర్మూలించవచ్చన్నారు. కావున జిల్లాలోని వైద్య సిబ్బంది 11వ తేదీ నుండి 24వ తేదీ వరకు ప్రతిరోజు మీ మీ ప్రాంతాల్లో ప్రతి ఇంటిని సందర్శించి కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వైద్యం అందించేందుకు అనుకూలంగా వైద్య సిబ్బందికి వైద్య అధికారులు శిక్షణ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంపై ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని, విస్తృతంగా ప్రచారం చేయాలని, ఐఈసి యాక్టివిటీలను ఎప్పటికప్పుడు నిర్వహించాలన్నారు. అనంతరం కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమం పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కట్టా వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డిపిఓ నాగరాజు నాయుడు, జిల్లా కుష్టు నివారణ అధికారి డా.జయలక్ష్మి, ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ బాలకొండయ్య, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డా.గంగాధర్ రెడ్డి, పారామెడికల్ అధికారి నాగన్న, ఆరోగ్య విద్య అధికారి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :