జిల్లాలో మంచినీటి సమస్య తలెత్తరాదు వ్యవసాయ అధికారులు ఈ-పంట నమోదు 100% పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురము, సెప్టెంబర్ 07: బహుజన వేదిక న్యూస్

ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో జిల్లాలో ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తకూడదని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్సం బంధిత అధికారులకు సూచించారు.

సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో జిల్లాలో ఎక్కడ కూడా మంచినీటి సమస్య తలెత్తకూడదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అన్ని మండలాల ఎంపీడీవోలకు మరియు అన్ని సంక్షేమ వసతిగృహాల డిడిలకు సూచించారు. ఎల్ నినో పరిస్థితుల ప్రభావంతో ప్రస్తుతం వర్షాలు పడే అవకాశం లేదన్నారు. ఈ విషయాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకొని జిల్లాలో మంచినీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడైనా మంచినీటి సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చినట్లయితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ వసతి గృహాలు, ఏపీ మోడల్ స్కూల్స్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మరియు రెసిడెన్షియల్ పాఠశాలలో నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మరియు ప్లాంటేషన్ కార్యక్రమానికి సంబంధించి మీకు ఇచ్చిన టార్గెట్ నెల రోజుల లోపల పూర్తి చేయాలన్నారు.

వి బి జి రామ్ జి పథకం ద్వారా జాబ్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి పనులు కల్పించి జిల్లాకు కేటాయించిన టార్గెట్ పూర్తి చేయాలన్నారు. విబిజి రాంజీ పథకంలో ఎస్సీ ఎస్టీలకు 100% పనులు కల్పించాలన్నారు. ఐ గాట్ కర్మయోగి కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలు పూర్తి చేసేందుకు ప్రతి ఉద్యోగి ఐగాట్ కర్మయోగి కోర్సులు పూర్తి చేసే విధంగా సంబంధిత నోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో చాలా వరకు పంటలు దెబ్బతినే అవకాశం ఉందని ఈ విషయాన్ని అన్ని మండలాల మండల వ్యవసాయ శాఖ అధికారులు దృష్టిలో ఉంచుకొని రైతులు వేసిన ప్రతి పంట 100% ఈ పంట నమోదు చేయించాలన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ జెడి సాలు రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిడి శైలజ, ఉద్యానవన శాఖ ఏడి ఉమాదేవి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :