ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువగా తీసుకెళ్లాలి…. సమాచార శాఖ ఆర్ జె డి ఎం వి ఎస్ ప్రసాద్ 

అనంతపురము, ఆగస్టు 20: బహుజన వేదిక న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రచారం కల్పించి వాటిని ప్రజలకు వచ్చేరోగా తీసుకెళ్లాలని సమాచార పౌర సంబంధాల శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎం వి ఎస్ ప్రసాద్ సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆయన గురువారం సాయంత్రం స్థానిక రైతు బజార్ వద్ద ఉన్న జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా డిఐపిఆర్ఓ బాల కొండయ్య తో కలిసి సమీక్షసమావేశంనిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు.

అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగంలో సమాచార శాఖ ఎంతో కీలకందని ప్రతి ఉద్యోగి బాధ్యత యుతంగా అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేసి శాఖకు మంచి పేరు తెచ్చే విధంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డి ఐ పి ఆర్ ఓ బాలకొండయ్య, డి పి ఆర్ ఓ ప్రభాకర్, పి ఆర్ ఓ సూర్యనారాయణ రెడ్డి, ఏపీఆర్ఓ ఫక్రుద్దీన్, సీనియర్ అసిస్టెంట్ ప్రభావతి, జూనియర్ అసిస్టెంట్ చాంద్ బాషా, టైపిస్టులు సుహాసిని దామోదర్ రెడ్డి , టెక్నీషియన్ కమల్ తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :